ఒక్కో రాతిరి మంచుతనంతో
శిల్పమౌతూ కరిగిపోతూ...
గుండె లోపల గని ఏదో
తవ్వుకుపోయినట్టు వెలితిగా...
దూరం దూరంగా వెలుగుతు
ఆరుతున్న వీధి దీపంలా...
మసక బారిన వెన్నెలతో
దేహాకాశం చిన్నబోతూ...
సంధ్యవేళ గుంపునుండి వేరై
ఒంటరైన పక్షిలా ఎగురుతూ...
బాట పక్కనే పెళ పెళమంటూ
ఎగసిపడుతున్న చితి మంటలా...
సొరంగమేదో తవ్వబడని
జైలు గదిలా...
నీరెండిన దిగులు బావిలా
దాహ తీరంలో...
భుజంపై ఒంటరితనం
చిరుగుల దుప్పటిలా వేలాడుతూ...
దూరం దూరంగా వెలుగుతు
ఆరుతున్న వీధి దీపంలా...
మసక బారిన వెన్నెలతో
దేహాకాశం చిన్నబోతూ...
సంధ్యవేళ గుంపునుండి వేరై
ఒంటరైన పక్షిలా ఎగురుతూ...
బాట పక్కనే పెళ పెళమంటూ
ఎగసిపడుతున్న చితి మంటలా...
సొరంగమేదో తవ్వబడని
జైలు గదిలా...
నీరెండిన దిగులు బావిలా
దాహ తీరంలో...
భుజంపై ఒంటరితనం
చిరుగుల దుప్పటిలా వేలాడుతూ...
ఒంటరితనానికి ప్రతిరూపం మీ ప్రతి కవితలో ఈ మధ్య తాడవిస్తుందండి.
ReplyDeleteఅలా వెంటాడుతోంది లోలోపల సృజన గారూ...దన్యవాదాలు..
Deleteఎందుకు మీరు ఇంత లోతు గా ఆలోచిస్తారు ??
ReplyDeleteఆలోచించడమే లోతుగా కదా RamyaSree Telu గారు.. ఇలా నా బ్లాగు సందర్శించినందుకు చాలా సంతోషంగా వుంది...థాంక్యూ..
Deletevarma garu chalaa chaalaa baagundandi ontarithanaanni baga avishkarinchaaru
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు skvramesh gaaru..
Deleteమీ భావాల్లో ఒంటరితనం ఎప్పుడూ అందంగానే ఉంటుంది:-)
ReplyDeleteఅవునా...:-)
Deleteమీ ఆత్మీయ స్పందనకు థాంక్సండీ Padmarpita గారు..
మీ కవితల్లోని ప్రతి అక్షరంలోను అద్భుతమైన భావం...అది ప్రేమైనా ఏకాంతమైనా
ReplyDeleteమీ ఆత్మీయ ఆప్త వాక్యానికి ధన్యవాదాలు ప్రేరణ గారు..
Delete