Sunday, December 16, 2012

దేహాకాశం

 ఒక్కో రాతిరి మంచుతనంతో
శిల్పమౌతూ కరిగిపోతూ...

గుండె లోపల గని ఏదో
తవ్వుకుపోయినట్టు వెలితిగా...

దూరం దూరంగా వెలుగుతు
ఆరుతున్న వీధి దీపంలా...

మసక బారిన వెన్నెలతో
దేహాకాశం చిన్నబోతూ...

సంధ్యవేళ గుంపునుండి వేరై
ఒంటరైన పక్షిలా ఎగురుతూ...

బాట పక్కనే పెళ పెళమంటూ
ఎగసిపడుతున్న చితి మంటలా...

సొరంగమేదో తవ్వబడని
జైలు గదిలా...

నీరెండిన దిగులు బావిలా
దాహ తీరంలో...

భుజంపై ఒంటరితనం
చిరుగుల దుప్పటిలా వేలాడుతూ...

10 comments:

  1. ఒంటరితనానికి ప్రతిరూపం మీ ప్రతి కవితలో ఈ మధ్య తాడవిస్తుందండి.

    ReplyDelete
    Replies
    1. అలా వెంటాడుతోంది లోలోపల సృజన గారూ...దన్యవాదాలు..

      Delete
  2. ఎందుకు మీరు ఇంత లోతు గా ఆలోచిస్తారు ??

    ReplyDelete
    Replies
    1. ఆలోచించడమే లోతుగా కదా RamyaSree Telu గారు.. ఇలా నా బ్లాగు సందర్శించినందుకు చాలా సంతోషంగా వుంది...థాంక్యూ..

      Delete
  3. varma garu chalaa chaalaa baagundandi ontarithanaanni baga avishkarinchaaru

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు skvramesh gaaru..

      Delete
  4. మీ భావాల్లో ఒంటరితనం ఎప్పుడూ అందంగానే ఉంటుంది:-)

    ReplyDelete
    Replies
    1. అవునా...:-)
      మీ ఆత్మీయ స్పందనకు థాంక్సండీ Padmarpita గారు..

      Delete
  5. మీ కవితల్లోని ప్రతి అక్షరంలోను అద్భుతమైన భావం...అది ప్రేమైనా ఏకాంతమైనా

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ ఆప్త వాక్యానికి ధన్యవాదాలు ప్రేరణ గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...