Tuesday, August 24, 2010

పాప జ్ఞాపకాలలోనీ జ్ఞాపకం నన్ను
నిరంతరం వెన్నాడుతూనే వుంది
నీ కేరింతలతో ఇల్లంతా
పున్నమి వెలుగులు నింపిన
నీ బోసి నవ్వును
మరువలేకున్నా..

నీ అర్థనిమీలిత నేత్రాలతో
సుషుప్తావస్తలో వున్న
నిన్ను చూసి ఎంతలా
మురిసిపోయామో కదా!

నీ లేలేత దేహ కాంతి పుంజం
తాకి నా వొడలంతా పులకరించిన
క్షణాన్ని ఎలా మరిచిపోగలను..

కానీ..
ఆకశాన మెరిసిన విద్యుల్లతలా
భువిని తాకిన నీ పాదాలు
వెన్వెంటనే మాయమయ్యాయన్న
నిజం నేటికీ మింగుడుపడలేదీ
గుండెకి..

నింగిని మెరిసిన మెరుపును
చూసినప్పుడంతా నువ్వు మరలా
నాన్నా అంటూ గుండెలపై
వాలతావని ఆశగా..
ఆర్తిగా..

(ఈ రోజు మా మొదటి ప్రేమఫలం 'పాప' పుట్టిన రోజు. తను పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించి ఆ తరువాత blueish గా మారి ఎనిమిదో రోజున మమ్మల్ని విడిచిపోయింది. నిరుద్యోగం, ప్రేమ పెళ్ళి ఇబ్బందులతో తనను కాపాడుకోలేకపోయనన్న guiltiness ఇప్పటికీ వెంటాడుతూ వుంది..)

19 comments:

 1. naakoo ilanti anbhavame vunnadi. Meeku jarigina badhakaramina sanghatana ardham chesukogalanu. Meeku 8 rojula anubhavam, naadi 4 nelala bandham antee teeda ! naa paapa ee lokanni vidichi 8 years ayyindi.

  ReplyDelete
 2. అజ్ఞాతగారు మాతో మీ బాధను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. Very Sorry Sir.

  ReplyDelete
 4. iam sorry.britishvaallalaa kaakundaa mee "kohinoornu" meeku thirigivvalani nenu nammani aa devunni korukuntuu...,(paapaku heartproblem laaga vundi)

  ReplyDelete
 5. so sad. hope she came back to you as another baby :)

  ReplyDelete
 6. @gajula: మిత్రమా పాప premature delivery వలన blue baby కావడంతో దూరమయ్యిందని తరువాత డాక్టరుగారు చెప్పారు. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

  ReplyDelete
 7. @రాణిః ఆ ఆశ మరిలేదు రాణిగారు. పాప తరువాత ఇద్దరు బాబులతో ఆగిపోయాం. రెండోది పాప అవుతుందనుకుంటే బాబే వచ్చాడు. పాప తీరని ఆశగా మిగిలింది. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

  ReplyDelete
 8. చాల బాధేసింది. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. మిగిలిన మితృలతో పాటు, మీ దుఃఖం పంచుకుంటున్నా, తీరని దుఃఖమైనా.

  ReplyDelete
 9. హెచ్చార్కె సార్ దుఃఖం పంచుకోవడం కంటె మైత్రికి గుర్తు ఏది? ధన్యవాదాలు సార్..

  ReplyDelete
 10. అయ్యో, ఎంతో బాధగా ఉందండీ! పసి పిల్లలకు చిన్న జలుబు చేస్తేనే తట్టుకోలేమే, ఎంతటి బాధను తట్టుకున్నారో కదా!

  డబ్బు చాలా మంచిదనీ,చెడ్డదనీ కూడా ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తూ ఉంటుంది.

  మీకు సానుభూతి అనడం కంటే మీ బాధను కొంత పంచుకుంటున్నా అనడం సమంజసం!

  సో సారీ!

  ReplyDelete
 11. @సుజాతగారూ నాకు ఉద్యోగవసరాన్ని గట్టిగా తెలిసింది పాప దూరమయిన తరువాతేనండీ.. బాధ్యతారాహిత్యంగా వున్నవాడికి పెళ్ళి చేసుకోవడం ఎందుకు అన్న విషయం ఈ విషాదం తరువాత తెలిసింది. కానీ సంపాదన ఇప్పటికీ అలవడలేదు, జీవనం అలా సాగిపోతూంది. మీ అత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..

  ReplyDelete
 12. mee post manasunu kalchi vestunadi.

  runaanubamdha roopenaa pasupatni suthaalayaa annaaru peddalu. meeku runam ledu . amte vidhi nirnayaalanu evarama maarchalemu.

  ReplyDelete
 13. మీ భాద వర్ణనాతీతం, కొన్ని సందర్బాలలో విధి కి తలవంచక తప్పదు. మీరు ఏమి అనుకోకుండా ప్రస్తుతం మీరేం చేస్తున్నారో చెప్పగలరా?

  ReplyDelete
 14. @అశోక్ పాపాయి Thanks for your kind concern Sir..

  ReplyDelete
 15. @surya మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు. మీ మైల్ ఐ.డి.ఇవ్వగలరు..

  ReplyDelete
 16. విధి బలీయం ! ఈ నిరుద్యోగం ఇవన్నీ మనం వెతుక్కునే కారణాలు మాత్రమే ....ఐనా కొందరు దేవతలు శాపవశాత్తు మానవ జన్మ ఎత్తాల్సివచ్చినపుడు ఇలాగే కనిపించి మాయమై పోతారట !మీ పాప కూడా అలాగే మీ ఒడిచేరకుండానే వెళ్ళిపోయి ఉంటుంది.ఆ దేవత ఏలోకాలకేగినా మీ కన్నీటి చుక్క నైవేద్యంగా స్వీకరించి మీఇంట వెలుగులు నింపుతుంది. ఎందుకంటే మరి మీ ఋణం తీర్చుకోవద్దూ .....

  ReplyDelete
 17. @పరిమళంః మేడం కంటే అమ్మా అని పిలవాలనిపించింది మిమ్మల్ని. మీ ఆత్మీయ వాక్యాలతో నా పాపను చిరంజీవిని చేసారు. మీ వ్యాఖ్యతో మా ఇద్దరి కళ్ళవెంట కన్నీరాగలేదు. ఆ వెలుగులకోసం ఆశగా ఎదురు చూస్తూ.. మీకు మా ధన్యవాదాలు..

  ReplyDelete
 18. Sorry to hear this sir.., my deepest condolences to you

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...