Friday, August 20, 2010

అమ్మ ఒడిలో..



అమ్మ ఒడిలో
తల వాల్చితే
కళ్ళనుండి ధారాపాతంగా
కారిన కన్నీటితో
సేద దీరిన మనసుతో
ఒక్కసారిగా ఏదో విద్యుత్ప్రవాహ తాకిడితో
మళ్ళీ ఉమ్మనీరులో ఈదినట్లుగా
మరో జన్మెత్తినట్లుగా
శిశువువలె
కేరింతలాడుతూన్నట్లు
అనుభూతి కలిగిన క్షణం
ఓ మహా యుద్ధ విజయానంతరం
వీరుని పెదవిపై ధరహాస చంద్రిక మెరిసిన క్షణం
కోల్పోయినదేదో గురుతెరిగిన మరుక్షణం
అమ్మ పాదాల చెంత
నా శిరశాభివందనం..

3 comments:

  1. దుఃఖ వీథి సహచరుడా! మీ బ్లాగు రూపం చాల బాగుంది. అక్షరాల టైపు కొంచెం ఇబ్బందిగా వుందెందుకో. మీ ఫ్లాగ్‍ చూశాను. ఏది కవిత్వమో ఏది కాదో ఎవరు చెప్పగలరు? అలాగని పాఠకుడు కవిని ఇష్టంగా చేరుకోవాలనే కోరికనూ వదులుకోవద్దు. మీ బ్లాగులో అరుణ తార లింకు ఇవ్వడం బాగుంది. థాంక్యూ.

    ReplyDelete
  2. @హెచ్చార్కెః మీరు నా బ్లాగు చూసి అభిమానంతో, కవితాత్మీయతతో వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు సార్. ఫాంట్స్ నా పిసిలో బాగానే కన్పిస్తున్నాయి. Firefox browser వాడుతున్నా.

    ReplyDelete
  3. prapanchaanni jayinchinaa ,ammaodilo dorike aanandaaniki samaanam kaadu.enni sampadalunna ,avanni amma tharuvaate.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...