Friday, August 6, 2010
మట్టి వేదం..
ఇప్పుడంతా కుబేరుల కాలం
అమ్మతనాన్ని కూడా సరుకునుజేసే మాయాజాలం
రంగుల పూతతో అమ్మజూపే టెక్నిక్ తప్ప
చనుబాల తీపినెరుగని వారి ఇంద్రజాలం..
ఈ మట్టి పూల పరిమళాన్ని
ఈ మట్టి సారవంతాన్ని
ఈ మట్టి తేజాన్ని
ఈ మట్టి జీవత్వాన్ని
ఈ మట్టి నాగరికతను
మండించి బూడిద చేసే కుట్ర
ఎవరి ఇంట కాంతుల కోసం
మా ఇంటి దీపాన్ని కొండెక్కిస్తావు?
తీరమంతా పరచుకున్న జీవజాలాన్ని
జీవజలాన్ని నీ విషపు
మలంతో నింపి
భవిష్యత్ తరానికి అవిటితనాన్ని
వారసత్వంగా ఇవ్వజూపే కుళ్ళుతనం కాదా?
ఈ మట్టి వేదం
అమ్మతనం..
ఈ మట్టి వేదం
మడమతిప్పని
గున్నమ్మ వారసత్వం..
ఈ మట్టి వేదం
పంచాది నిర్మల పోరాట వారసత్వం..
ఈ మట్టి వేదం
శ్రీకాకుళ రక్తతర్పణం..
ఈ మట్టి వేదం
కుట్రలకెదురొడ్డి జబ్బచరచడం...
Subscribe to:
Post Comments (Atom)
కవిత బాగుంది.
ReplyDeleteanthima vijayam vachhedaaka poraatam aapakunda,amaraveerula thyagaalanu smarinchukunru,mana pillalaku bangaaru bhavisyattukai,e roju mana varthamaanaanni udyamaalatho nimpudaam
ReplyDelete''ఎవరి ఇంట కాంతుల కోసం
ReplyDeleteమా ఇంటి దీపాన్ని కొండెక్కిస్తావు''మంచి ఎక్స్ ప్రెషన్.సోంపేట పోరు బాటకి మంచి కవితని ఇచ్చారు.
Excellent....
ReplyDelete