Friday, August 1, 2014

కొన్ని నవ్వుల మధ్య...



కొన్నిసార్లు మాటలన్నీ పోగులుపడి 
సమయమంతా క్షణాలుగా కరిగిపోయి 
నీ చుట్టూ ఇన్ని వెలుతురు పిట్టల కాంతి పరచుకుంటుంది

దేహాలు వేరైనా కన్నపేగు బంధమేదో నెత్తుటి సంబంధాన్ని 
జ్నాపకాల తెరల పై రంగుల చిత్రంగా ఆవిష్కరిస్తుంది

కాలాన్ని కరిగించి హృదయాలను తెరచి మాటాడుకుని 
దు:ఖాన్ని గొంతులో దాచి కొన్ని నవ్వులుగా వెలిగించే మనుషులున్నందుకు 
మనమింకా బతికి వున్నామన్న స్పృహనిస్తుంది

వాళ్ళకి నీకూ ఉన్న ఋణానుబంధమేదో 
నిన్నెప్పటికీ మనిషిగా నిలుపుతుంది..

2 comments:

  1. కాలాన్ని కరిగించి హృదయాలను తెరచి మాటాడుకుని
    దు:ఖాన్ని గొంతులో దాచి కొన్ని నవ్వులుగా వెలిగించే మనుషులున్నందుకు
    మనమింకా బతికి వున్నామన్న స్పృహనిస్తుంది....మధురభావం వర్మగారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...