Monday, July 21, 2014

నువ్వు - అల



సముద్రమంత మనసు నీది 
ఎన్ని అలలు వచ్చినా పోటెత్తని తీరం దాటని గంబీరత నీది

వెన్నెల అలా నీ గర్భంలో స్నానమాడి 
ఈదులాడి ఆకాశానికి అతుక్కుపోదామనుకోలేదిలా

నువు పిలవని అతిధిలా నీ గుమ్మం ముందు 
చిట్లిన పెదవినంటిన నెత్తుటి చిరునవ్వుతో

నీ కళ్ళలో నైరాశ్యం వలయంలా
నీ కరచాలనంలో విరిగిపడిన 
అసహజ మెలికల మెటికల శబ్దం గుచ్చుకుంటూ

తీరం చేరని అలలా ఒరుసుకుంటూ
వి
రి
గి 
డు
తూ
.
.
.

15 comments:

  1. Chaalaa baagundi kcube gaaru:):)

    ReplyDelete
  2. నువు పిలవని అతిధిలా నీ గుమ్మం ముందు
    చిట్లిన పెదవినంటిన నెత్తుటి చిరునవ్వుతో .........ఇలాంటి ఉపమానాలు హృఉదయాన్ని మెలిపెడతాయి.

    ReplyDelete
  3. అలా అలై వచ్చిపోయేప్పడైనా గాయాలని కనబడనీయకుండా జాగ్రత్త పడొచ్చుకదా సార్ :-) కవిత టచింగ్

    ReplyDelete
  4. బాగుంది మీ అల

    ReplyDelete
  5. మెప్పించారు మీ ఈ కవితతో

    ReplyDelete
  6. సముద్రమంత మనసు నీది
    ఎన్ని అలలు వచ్చినా పోటెత్తని తీరం దాటని గంబీరత నీది....ఇదేదో ముందరికాళ్ళకి బంధంలా ఉందండి వర్మగారు :-)

    ReplyDelete
  7. బంధాలేసేంత పెద్దవాడినా:-)

    థాంక్యూ..

    ReplyDelete
  8. బ్లాగ్ ఒపెన్ చెయగానె సాంగ్ ఎలా వస్తుందొ చెప్తారా

    ReplyDelete
  9. ఛాలా బాగా చెప్పారు
    News4andhra.com is a Telugu news portal and provides
    Telugu Movie News, Latest and Breaking News on Political News and Telugu Movie Reviews at one place

    ReplyDelete
  10. aa song player pai press cheste site open avutundi, akkada register ayi meeku nachina song upload chesi embedded linkni bloglo settinglo htmllo paste cheste chaalu..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...