Thursday, July 3, 2014

నిదురపో...


అక్షరానికింత పరిమళమెందుకొ 


నువ్వలా కాసిన్ని మాటలు మౌనంగా పోగు చేసి నీ మునివేళ్ళతో దారం కడుతున్నప్పుడు



తడి అంటిన పూల మధ్య ఏదో సంభాషణ మొదలయ్యి ఖాళీలను పూరిద్ద్దమనుకుంటూ



అలా గాలి వీస్తూ కొన్ని రేకులు విడివడి నీలి శంఖం పూల కాంతి నీ కనురెప్పలపై వాలి బరువుగా నిద్రనావహిస్తూ ఓ ఆవలింత



ఓ పక్కకు ఒరిగి ముంజేతి మలుపులో సేదదీరే వేళ కాసింత నిశ్శబ్దాన్నాహ్వానిస్తూ కిటికీ తెరచి వెన్నెల పరచుకుంది 



నిదురపోరా...

10 comments:

  1. తడి అంటిన పూల మధ్య ఏదో సంభాషణ.....నచ్చిందండి

    ReplyDelete
  2. అలా గాలి వీస్తూ కొన్ని రేకులు విడివడి నీలి శంఖం పూల కాంతి
    నీ కనురెప్పలపై వాలి బరువుగా నిద్రనావహిస్తూ ఓ ఆవలింత..నిదురపోరా...Love this

    ReplyDelete
  3. నిద్రపొమ్మని మమ్మల్ని నిద్రపుచ్చుతూ మీరే నిద్రపోతే ఎలా :-)

    ReplyDelete
  4. నమస్కారం కుమారుగారు. పద్మార్పితగారి బ్లాగులో మీరు నాకు సుపరిచితమే. మీ రచనాక్రమం నాకిష్టం.

    ReplyDelete
  5. ఓహో మీరూ వెన్నెల ప్రియులేనా :-)

    ReplyDelete
    Replies
    1. naa daare vennela daari :-) thank you for coming in to my blog..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...