Monday, August 4, 2014

యిది సమయం కాదని!!


నువ్ రోజూ కూచున్న చోటులోనే 
ఏ ఎండ పొడా పడని ఆ దిక్కులోనే 
తడి యిగరని ఆ ఐమూలలోనే 
వాడి వాలిన పూరేకును దోసిలిలో పట్టి


నీకూ తెలుసు కదా 
యిది సమయం కాదని


దాగివున్న కన్నీటి బొట్టేదో వేడిగా 
జారిపడి వాడినదేమో కదా


పసి వాళ్ళ నెత్తుటి బొట్టేదో ఎర్రగా 
ఈ చివురునంటి తుపాకీ మందు వాసనేస్తూ


ఆసుపత్రి పైనా ప్రేమికులు కలిసి వున్న చోటుపైనా
వాడొక్క తీరే మందుగుండు వేయగలడు 


నువ్వూ నేనే కదా అప్రమత్తంగ లేక 
యీ తునాతునాకలైన దేహపు గాజు ముక్కలనేరుతూ
యీ దిక్కుగా గాయాల సలపరంలో నవ్వుతున్నది


నవ్వు వాడినెప్పుడూ భయపెడుతుంది...

11 comments:

  1. వాడి వేటకు బలైనది జీవితాలు కాదు హృఉదయాలు,
    కఫన్‌ చాటున కప్పబడిన నవ్వులు....అద్భుతంగా ఉంది సర్, ఇలా మీరే రాయగలరు.

    ReplyDelete
  2. మీ అక్షర తూటాలకు ప్రేమగా మనసులో ఒదిగిపోవడం బాగా తెలుసునండి వర్మగారు.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారు..

      Delete
  3. "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
    http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

    ReplyDelete
  4. మీ కవితల్లో తెలియని ఆవేదన

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు..

      Delete
  5. కవిత బాగుంది కుమార్ వర్మాజీ

    ReplyDelete
  6. సర్...మీకు తెలిసినంతగా గాయాల సలపరాలు, నెత్తుటిబొట్ల మాటలు మరెవ్వరికీ తెలియవనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. meerannadi vetakaarama pogadto? yemainaa chadivi spandinchinanduku thanks Aniketh..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...