Friday, August 22, 2014

భిక్షా పాత్రలా..


నేనో భిక్షాపాత్రలా నీ ముందు

నువ్వాడే మాట కోసం వేచి చూస్తూ

నువ్వలా విసురుగా వెనుదిరిగి పోతూ తళుక్కుమంటావు

అక్కడే కదా ఆ స్థానంలోనే అలా స్థానువయ్యాను

మరల మరలా నువ్వక్కడే ఆగుతావని

ఓ చినుకులా రాలి దప్పికగొన్న నాలో దాహమౌతావని

ఒక్కో క్షణం లెక్కిస్తూ నేనిలా 

యుగాలుగా నువ్వక్కడలా ఓ వర్ణ చిత్రంలా 

చివరి సంతకంలా 

నే
ని
లా

ఒ లి కి పో తూ....

4 comments:

  1. ఎదురుగా ఉన్నా మీరిలాగేనా సార్ :)

    ReplyDelete
  2. బాగుంది మీ భిక్షపాత్ర కవిత

    ReplyDelete
  3. yedurugaa leke kadaa ilaa :-) thank you

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...