Thursday, June 21, 2012

కరచాలనం...


రెండు అరచేతుల కలయికేనా
కాదిది
రెండు హృదయాల చేరువ...

ఒకరికొకరి స్పందనను
ఎదలోతుల్లోకి కొనిపోయి
కళ్ళలో కాంతులు పూన్చి
చిరునవ్వుల వెన్నెలలు విరిసే
ఆ క్షణాలు
మరపురాని హృదయాలింగనాలు...

అలా రెండు చేతులు తాకగానే
జర జరా రక్త నాళాలగుండా
ఓ విద్యుత్తు ప్రసారమై
ఏనాటివో తీపి గురుతులను
మేల్కొలిపి కనుల ముందు
వెండి తెరపై చిత్రంలా పరచుకుంటాయి...

గట్టిగా వత్తిన స్పర్శతో
అంతరాళంలో అలముకున్న
అనుమానాపు పొరలు తొలగి
ఒక్కసారిగా అలాయి బలాయి
చెప్పుకుంటాయి....

అంధునికైనా కరచాలనం
నీ రూపును
నీ మనసును
చూపుతుంది కదా....

మిత్రమా!
తొడుగులన్నీ తొలగించి
ఎదనిండా స్నేహాన్ని ఊపిరి చేసుకొని
తొలకరి చినుకులా నవ్వుతూ
ఒక్కసారి చేయికలుపుమా...
(నేడు కరచాలనా దినోత్సవం సందర్భంగా)

9 comments:

  1. ఒకరికొకరి స్పందనను
    ఎదలోతుల్లోకి కొనిపోయి
    కళ్ళలో కాంతులు పూన్చి
    చిరునవ్వుల వెన్నెలలు విరిసే
    ఆ క్షణాలు
    మరపురాని హృదయాలింగనాలు...
    Beautiful lines..shake hand plz:-)

    ReplyDelete
  2. అందునికైనా కరచాలనం తో మన మనస్సు, రూపం కానరావటం , ఈ ఆలోచన ఎవరికీ వస్తుంది వర్మ గారికి తప్ప. నిజంగానే తోడుగులన్ని తొలగిపోతాయి కర స్పర్సతో బాగుంది, మంచి భావన. వర్మాజీ .

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ కరస్పర్శలాంటి స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete
  3. చక్కగా వ్రాసారు వర్మ గారూ!
    కరచాలనా దినోత్సవం నాడు
    అభినదనల కరచాలనం అందుకోండి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. @శ్రీ గారూ మీ ఆత్మీయ పదస్పర్శకు ధన్యవాదాలండీ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...