ముసురు పట్టిన మేఘం
ఒకటే ధారగా కురుస్తోంది
అదే పనిగా...
ఎక్కడా పూర్తిగా కప్పలేనితనంతో
వెన్నుపైనుండి ధారగా
నడి సంద్రంలోలా
కురుస్తూనే వుంది లోలోపల...
ఆ యింట్లో పొయ్యిలో
మూడు రోజులుగా బూడిద
తియ్యక పాలిపోయిన గోడలు...
ఎటూ తడవకుండా మిగలని
కట్టెలను చూస్తూ కన్నీరుతో
మరింతగా తడుస్తూ...
ఉట్టిలో మిగిలిన చద్దన్నం
చివరి ముద్ద చిన్నది తిని
మరొకటి కోసం గోరపిట్టలా
నోరు తెరవగా గుండె వరదైంది...
గూటిలోని దీపం అడుగంటిన నూనె
చినుకుతో ఆరిపోతూ
చీకటిని కప్పుకుంటూ...
జ్వరం వచ్చిన అవ్వ
మూలుగుతూ మెరుస్తున్న
మెరుపులో తెల్లగా చినికిన
గుడ్డ పీలికలా మంచంలో...
నుదుటిపై చెరిగిపోతున్న
బొట్టును దిద్దుకుంటూ ఓ మూలన
ముసురుపట్టిన దేహంతో గుమ్మానికి
వంకీలా అతుక్కుపోయిన ఆమె...
చిల్లిగవ్వలేనితనం వెక్కిరిస్తూ
మెలితిప్పుతున్న పేగులను
మోకాలితో ముడుచుకుంటూ
తొక్కిపట్టి బిగబట్టిన గొంతు...
ఆకాశమంతా హరివిల్లు పరచుకుంటూ!
నా నెత్తిపై ఒక్కో చినుకు
టిక్ టిక్ మని పడుతూ శబ్ధలాస్యంతో వెక్కిరిస్తూ...
ఒకటే ధారగా కురుస్తోంది
అదే పనిగా...
ఎక్కడా పూర్తిగా కప్పలేనితనంతో
వెన్నుపైనుండి ధారగా
నడి సంద్రంలోలా
కురుస్తూనే వుంది లోలోపల...
ఆ యింట్లో పొయ్యిలో
మూడు రోజులుగా బూడిద
తియ్యక పాలిపోయిన గోడలు...
ఎటూ తడవకుండా మిగలని
కట్టెలను చూస్తూ కన్నీరుతో
మరింతగా తడుస్తూ...
ఉట్టిలో మిగిలిన చద్దన్నం
చివరి ముద్ద చిన్నది తిని
మరొకటి కోసం గోరపిట్టలా
నోరు తెరవగా గుండె వరదైంది...
గూటిలోని దీపం అడుగంటిన నూనె
చినుకుతో ఆరిపోతూ
చీకటిని కప్పుకుంటూ...
జ్వరం వచ్చిన అవ్వ
మూలుగుతూ మెరుస్తున్న
మెరుపులో తెల్లగా చినికిన
గుడ్డ పీలికలా మంచంలో...
నుదుటిపై చెరిగిపోతున్న
బొట్టును దిద్దుకుంటూ ఓ మూలన
ముసురుపట్టిన దేహంతో గుమ్మానికి
వంకీలా అతుక్కుపోయిన ఆమె...
చిల్లిగవ్వలేనితనం వెక్కిరిస్తూ
మెలితిప్పుతున్న పేగులను
మోకాలితో ముడుచుకుంటూ
తొక్కిపట్టి బిగబట్టిన గొంతు...
ఆకాశమంతా హరివిల్లు పరచుకుంటూ!
నా నెత్తిపై ఒక్కో చినుకు
టిక్ టిక్ మని పడుతూ శబ్ధలాస్యంతో వెక్కిరిస్తూ...
చాలాబాగారాసారండి.
ReplyDelete@yohanth: thank you..
Deleteఆర్ద్రతలో తడిచిన పేదరికం కనబడుతుంది మీ ఈ కవితలో.
ReplyDeleteyou are great.
@అనికేత్ః మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..
Deleteకవిత, దానికి తగ్గ చిత్రము రెండూ చాలా బాగున్నాయి వర్మగారు....
ReplyDelete@సాయి గారూ ధన్యవాదాలండీ...
Delete"ఆ యింట్లో పొయ్యిలో
ReplyDeleteమూడు రోజులుగా బూడిద
తియ్యక పాలిపోయిన గోడలు..."
కవిత ఆసాంతం అద్భుతం తమ్ముడూ !
@జ్యోతక్కా ధన్యవాదాలు..
Deleteవర్మ గారు ,
ReplyDeleteచాలా బాగుంది..!
@సీతగారు థాంక్సండీ...
Deletekastalu kannillu aanandaalu anni baagaa raasaru baavundi chaalaa
ReplyDelete@చెప్పాలంటే..మంజు గారూ మీ వివరణాత్మక స్పందనకు ధన్యవాదాలండీ..
Deletenice, chakkaga raasarandi.
ReplyDeleteథాంక్యూ భాస్కర్ గారూ..
Deletevarma garu its touching
ReplyDeletethank you satya sir..
Delete