Saturday, June 9, 2012

సామూహిక నెత్తుటి పాట..



ఇక్కడేదో
ఓ సామూహిక గానాన్ని
ఆలపించి వదలివెళ్ళిన
గురుతులు...

ఇసుక మట్టిలో
ఎర్రగా మిగిలిన
నెత్తుటి చుక్కలు...

గాయకుడెవరో
నాభిని చీల్చుకొని
తన ఆదిమ సంగీతాన్ని
ఆలపించినట్టున్నాడు...

ఏదో కనుగుడ్డు
ఓ అసంపూర్ణ వర్ణ
చిత్రాన్ని దర్శించి
చిట్లినట్టుంది...

గాలి ఏదో
ధూళి మేఘాన్ని
మోసుకొచ్చి ఇక్కడ
కూలబడినట్టుంది...

దుఖమొక్కటే
చివరి సంతకమైనట్టు
ఏదో చిందర వందరగ
అటూ ఇటూ
చెల్లాచెదురు చేస్తూ....

గుండె పగిలి
పొగిలి పొగిలి
ఏడ్చినట్టు
ఆకురాలిన చోట
చిట్లిన నేల...

విరిగిన వేణువు
స్రవిస్తున్న
నెత్తుటి పాటనెవరో
దోసిలి పట్టి
గొంతులో
నింపుకు పోయినట్టున్నారు..

(సాల్వడార్ డాలీ పెయింటింగ్ వాడుకున్నందుకు క్షమాపణలతో)

18 comments:

  1. వర్మ గారూ, కవిత బాగుంది ఉపమానాల ప్రయోగం ఇంకా బాగుంది.

    ReplyDelete
  2. విధ్వంసకాండని కూడా ప్రశాంతంగా చెప్పగల నేర్పరి మీరు.

    ReplyDelete
    Replies
    1. వావ్.. అనికేత్..థాంక్యూ వెరీమచ్..

      Delete
  3. చాలా బాగుంది వర్మ గారు ......silenct gaa violence పండించారు......


    -- సీత.....

    ReplyDelete
    Replies
    1. ఓహ్..ధన్యవాదాలు సీతగారు..

      Delete
  4. వర్మగారు చిత్రం మరియు మీ కవిత పోటీపడుతున్నాయండి!

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ పద్మాజీ..

      Delete
  5. చాలా బాగుంది...

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ సాయి గారు..

      Delete
    2. వర్మగారు ఇక్కడ రాస్తున్నందుకు క్షమించండి.. మీరు అడిగిన దానికి సమాధానం రాసాను చూడండి..
      http://namanasucheppindi.blogspot.in/2011/12/xps-pdf.html

      ఈ కామెంట్ డిలీట్ చెయ్యగలరు....

      Delete
  6. చాలా బాగుంది వర్మ గారూ!
    చిత్రం ముందా?
    కవిత ముందా?
    అనుకునేంత బాగుంది...
    @శ్రీ

    ReplyDelete
  7. చిందర వందరగా మారని దుఖం అంత ఒకే చోట గూడు కట్టినట్లు గా మనసు ముక్కలయింధీ సర్ జి . అంత వేదన తట్టుకోవటం కష్టమే .

    ReplyDelete
    Replies
    1. vedanantene tattukolenidi kadaa Seleneji.. thanks for your appearance here..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...