Monday, June 4, 2012

నేల రాలిన పూలు..



నేల రాలిన పూలని
ఏరుకొని జేబులో వేసుకున్నా...

ఎవరి సిగలోంచో జారిపడ్డట్టున్నాయి
కాస్తా తల నూనె కలగలపిన
పరిమళం చేతికంటుతూ...

గాలికెగురుకుంటూ వచ్చిన
కాగితపు ముక్కని
ఆప్యాయంగా చేతుల్లోకి
తీసుకున్నా..

ఎవరో తన ప్రేయసికో అమ్మకో
రాసిన ఉత్తరంలా వుంది...
చివరిగా
నీవు నా కంట్లో వెలుగువి
అన్న మాటలే కనబడి
రెప్పలొక్కసారిగా
మూతబడి తెరుచుకున్నాయి...

దారిపక్కన దాహంతో
ఇంతలా నాలిక చాపుకుంటూ
కుక్క పిల్ల
చేతుల్లోకి తీసుకున్నా...

రూపాయి వాటర్ పేకెట్
కొని నా గొంతులో ఇన్ని
చుక్కలు పోసుకొని
దాని నోట్లో యింత తడిపా
కు(య్ కు(య్ మంటూ
మారాం చేస్తూ
నడిచినంత మేరా వెంటబడుతోంది...

దూరంగా వీధి లైటు వెలుగుతున్నా
వేడి తగ్గని సాయంత్రం
చాయ్ తాగి కూచుందామంటే
కాలుతున్న కుర్చీ ఫ్రేము
సెగలు కక్కుతున్న
దుఖానపు గీతలు పడ్డ మసి గోడలు
అంతా ఆబ్ స్ట్రాక్ట్ చిత్రంలా
కళ్ళముందు...

ఒక్కొక్కటిగా బయల్దేరిన
కాకులన్నీ గుంపుగా
మళ్ళీ తూరుపు వైపుగా
పయనమవుతూ
ఎందుకో సాయంత్రపు
నిశ్శబ్ధాన్ని జోకొడుతున్నట్టున్నాయి...

వీధి మలుపులో
ఎవరో ఆగి
వేచి చూస్తున్నట్టున్నారు
పడమటి సంధ్యలోని
వెలుగు కోసం...

12 comments:

  1. చాలా కాలం తర్వాత బెంగాలి అనువాదం చదివినట్లు అనిపిస్తుంది సున్నిత మైన శైలి మీ కవితల్లో కనిపిస్తింది వర్మాజీ

    ReplyDelete
    Replies
    1. మీ స్పూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ..

      Delete
  2. ఏంటో గుప్పెడు భావుకతా క్షణాలను కాలపు జేబులో దాచుకున్నట్లుంటాయి మీ అక్షరాలన్నీ....అందుకే నాకా క్షణాలంటే ఇష్టం...

    ReplyDelete
    Replies
    1. మీ కవితాత్మక స్పందనలే ఊపిరి కదా పద్మా శ్రీరాం గారూ..థాంక్యూ...

      Delete
  3. Nice! బాగుందండి వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. Thank you జలతారువెన్నెల గారు..

      Delete
  4. ఇలా పేరాలోని చివరి రెండు లైన్స్
    చదివి చదివి నెమరు వేసుకుంటున్నా...
    భలే! కవికాని నాకు కవిత్వం వచ్చినట్లు
    దటీజ్....వర్మాజీ, క్షమించండి ఇలా తప్పైతే...

    కాస్తా తల నూనె కలగలపిన
    పరిమళం చేతికంటుతూ...
    ఆప్యాయంగా చేతుల్లోకి
    తీసుకున్నా..
    రెప్పలొక్కసారిగా
    మూతబడి తెరుచుకున్నాయి...
    ఓ కుక్క పిల్ల
    చేతుల్లోకి తీసుకున్నా...
    అంతా ఓ ఆబ్ స్ట్రాక్ట్ చిత్రంలా
    కళ్ళముందు...
    ఎందుకో సాయంత్రపు
    నిశ్శబ్ధాన్ని జోకొడుతున్నట్టున్నాయి...
    పడమటి సంధ్యలోని
    వెలుగు కోసం...

    ReplyDelete
    Replies
    1. నిన్ను క్షమించేంత గొప్పవాణ్ణేం కాదు అనికేత్..నేనూ నీలానే సాహిత్యపు బాటసారినే.. చూసావా నీలోని భావుకత ఎంతగా నేను రాసినదానిలోని గుజ్జునేరి ముంజును చూపిందో...థాంక్యూ వెరీమచ్...

      Delete
  5. కవిత చాలా బాగుందండి.

    ReplyDelete
  6. I just noticed that you have one more blog today. Interesting...for some reason I missed it! I will try to follow that blog as time permits.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...