ఎప్పుడూ
నీదో ప్రపంచం
నాదో ప్రపంచం...
ఒకే గాలి పీలుస్తున్నా
చెరొకరి వాసనలు వేరు...
ఒకే నీటిలో ఈదులాడుతున్నా
చెరొకరి పాయలు వేరు...
ఒకే గదిలో ఎదురెదురుగా వున్నా
యిద్దరి మధ్యలో గోడ...
ఒకే దిండుపై రెండు దేహాలు వున్నా
అతకని తలపులు...
ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయినా
మనసులు చెరో్వైపు...
ఈ కలవని కలల కలవరింపు
అలుపెరుగని ఈ పయనం ఎటువైపు?
ఎప్పుడూ నిట్టూర్పుల అలసటతో
విరామమెరుగని ఈ ప్రస్థానం ఎందాక??
ఎగురుతున్న గాలి పటాలను
కలపలేని దారాల విఫలయత్నం కదా?
సాగనీ ఈ ముసుగు యుద్ధం
యింక విరమణ మరణయాతన కాదా??
chaalaa bhaaga raasaarandi, nice one,
ReplyDeletekeep writing.
if you have time,plese visit " ee bhandham drudamainadi" (http://bhaskar321.blogspot.in/2012/06/blog-post_12.html)in my blog.
thanking you sir.
Thank you Bhaskarji..
Deleteచాలా కుటుంబాల్లో ప్రస్తుతం మీ కవితలాగా ఉందండి .
ReplyDeleteఒకే గాలి పీలుస్తున్నా
చెరొకరి వాసనలు వేరు.విభిన్నంగా ఉందండి ఈ ప్రయోగం.
సరళమైన వాస్తవికమైన కవిత.
@oddula ravisekhar గారూ ధన్యవాదాలండీ..
Deleteఏంటో గత రెండురోజులుగా బ్లాగ్ మిత్రులంతా ఇద్దరు ఒకటికాదు, ఒకటైన ఇరువురు అంటూ కవితలల్లేస్తున్నారు?
ReplyDeleteఏదైనా పోటీనా? అయినా వేటికవే విభిన్నంగా ఉన్నాయి.
@ప్రేరణ గారూ అవునా! థాంక్సండీ...
Deleteవర్మ గారు, కవిత బాగుందండి.
ReplyDeleteకాని ఒకటి చెప్పనా?
ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయలకు మరొకరు విలువ ఇస్తూ, ప్రేమ గా ఉంటే చాలండి.పూర్తిగ మనసున మనసై, బ్రతుకున బ్రతుకై జంటలు ఎన్ని ఉంటాయండి? సహచర్యం వలన కొన్ని సంవత్సరాla ku ఒక గట్టి బంధం తప్పక ఏర్పడుతుంది.
వెన్నెలగారూ ఆశిద్దాం అలానే...బాగుందన్నందుకు ధన్యవాదాలండీ..
Deleteఇది నిజమైనా ఒప్పుకోడానికి ఇష్టపడనివారే చాలామంది. ఒకరికొరం ఉన్నామంటూ మనసుపై మేలిముసుగు వేసుకుని జీవిస్తున్నవారెందరో.Nice post Varmaji.
ReplyDeleteThank you Padmarpitagaru..మేలి ముసుగు తొలగించి చూడడమే మన పని కదా...
Deleteబిన్న ద్రువాలలా కలవని మనసులు కలసి జీవిస్తున్న మనుషులు. ఇది ఎన్నో జీవితాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న జీవన క్రీడ. సర్, చాలా బాగా రాసారు. ( మీ కొత్త కవితకు కామెంట్ పెట్టాలంటే కర్సర్ కామెంట్ బాక్స్ లో రావటం లేదు, కొంత సమయం తర్వాత వీలవుతుంది, కనుక ఆలస్యంగా కామెంట్ పెడుతున్నాను.)
ReplyDeleteథాంక్యూ వెరి మచ్ ఫాతిమాజీ...
Deleteశ్రమ అయినా కామెంట్ రాసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు..
బాగుంది వర్మ గారు..
ReplyDelete