Saturday, July 7, 2012

ఇప్పపూవులా....


నిజానికి
నిన్నెప్పుడూ కలగనలేదు...

ఎందుకో
నువ్వు దూరంగా వున్నావనుకోలేదు...

రాత్రికి వెన్నెల దూరమైనా
పగటికి సూరీడు ముఖం చాటేసినా
నువ్వెప్పుడూ నాకు దూరం కాలేదు...

అయినా
నువ్వెప్పుడూ కలగానో దూరంగానో
జరుగుతూనే వుంటావు...

ఇప్ప పూవులా
మత్తుగా
పరిమళిస్తూనే వుంటావు...

6 comments:

 1. చాలా బాగా వ్రాసారు వర్మ గారు...

  ReplyDelete
 2. చాలా బాగుందండీ

  ReplyDelete
 3. @సీత గారు థాంక్యూ వెరీ మచ్...

  @చిన్ని గారు థాంక్సండీ...

  ReplyDelete
 4. ippa puvvu lanti kavitha, nice.

  ReplyDelete
 5. నేను ఇప్పపూలు ఎప్పుడూ చూడలేదు అండీ...
  మీ కవిత చాలా బాగుంది..

  ReplyDelete
 6. ఓ!!! ఇప్పపూలంటే ఇవ్వా?
  కవిత బాగుందండి

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...