Friday, July 20, 2012

ఫీనిక్స్ లా...


ఇక్కడే
ఆగిపోయానుకదా?
నువ్వు చూసిన
ఈ మలుపు దగ్గరే...

స్మృతులన్నీ
ఒక్కోటీ ప్రతిసారీ
లోపలంతా
కోస్తూనే వున్నాయి...

నెత్తురంటిన
అక్షరాలన్నీ
పాట కట్టకుండానే
పారబోసావు కదా?

ఏదీ వదిలేయనూ లేక
ఏదీ అందుకోనూ లేక
ఓ చెట్టు మొదలులా
అటూ ఇటూ ఊగుతూ పాతబడి...

రాపిడవుతున్న
క్షణాలన్నీ లోలోన
దహిస్తూ అణువణువూ
బూడిదలా రాలుతోంది...

రాకపోతుందా
ఓ వాన మబ్బు!!
చినుకు పడి
మళ్ళీ ఫీనిక్స్ లా లేస్తా??

18 comments:

  1. చివరి లైన్లు ఆశాజనికంగా ఉన్నాయండి!:-)

    ReplyDelete
    Replies
    1. చివరిలో కలుగుతుంది కదండీ ఆశ..అందుకేనేమో అలా పలికింది..:-)
      ధన్యవాదాలు పద్మ గారు..

      Delete
  2. చాలా బాగుందండి..

    ReplyDelete
  3. ఏదీ వదిలేయనూ లేక
    ఏదీ అందుకోనూ లేక
    ఓ చెట్టు మొదలులా
    అటూ ఇటూ ఊగుతూ పాతబడి...
    చాలా చక్కగా రాశారండి,అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలు ఎల్లప్పుడూ పొందాలని ఆశ భాస్కర్జీ..థాంక్యూ..

      Delete
  4. మళ్ళీ ఫీనిక్స్ లా లేస్తా !మొక్కకే అంత ఆశావాదం వుంటే మనిషికెంత ఉండాలో కదా!inspiring

    ReplyDelete
    Replies
    1. అలా బీడు నేలలో కూడా మొలకెత్తాలనే ఆశ..మీ స్పందన స్ఫూర్తిదాయకం oddula ravisekhar గారూ..ధన్యవాదాలు..

      Delete
  5. Replies
    1. థాంక్యూ ప్రేరణ గారు..మంచి కామెంటుతో ప్రేరణనిచ్చారు..

      Delete
  6. chiguraasha - chinuku

    vidadeeyaraanivi.

    very strong expression.

    chaalaa baavundi. naaku nacchindi. Thank you very much..Sir!

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ వనజవనమాలి గారు..ధన్యవాదాలు..

      Delete
  7. బాగుందండీ మనసులోని భావం
    అది లోలోపలే పడే వేదన
    ఆ క్షణాల కోసం ఎదురుచూసే నిరీక్షణా....

    ఒక్క చినుకు చాలదా మళ్ళీ ఫీనిక్స్ లా లేచి
    ఆ ఊగే ఆశల మొదలు మహావృక్షమై ఎదగటానికి...

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ విశ్లేషణతో కూడిన స్పందనకు ధన్యవాదాలు చిన్ని ఆశగారూ...

      Delete
  8. Sir,
    అద్భుతమైన భావం. అందమైన రంగు రంగుల పక్షి ఫినిక్స్ తో పోలిక అతంత అందంగా అద్భుతంగా ఉంది. కవితలో ప్రేమికుడి ఆశావాదం, ప్రేమికులను అంతం లేని, శాశ్వతమైన ఫినిక్స్ తో పోల్చడం చాలా బాగుంది. తనకు తానుగా అంతం చెంది, మళ్ళీ జన్మించే ఫినిక్స్ తో పోల్చడం, ప్రేమ/ప్రేమికులు శాశ్వతం అని చెప్పకనే చెప్పుతున్నారు.Marvales.కవిత simply a marvel.

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణాత్మక స్పందనతో స్ఫూర్తినిచ్చారు ఫాతిమాజీ..ధన్యవాదాలు...కవితలోని హృదయాన్ని పట్టిచ్చారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...