Tuesday, July 24, 2012

కాలమంతా...

http://img183.imageshack.us/img183/4695/waterdrop1.jpg
ఇప్పుడంతా రాలిపోవడమే
కాలమంతా...

కంటినీరింకిపోవడమే
కనులకింత ఓదార్పుకదా...

ఆకు నుండి జారిపడుతున్న
చివరి బొట్టు దోసిలిలో...

కళ్ళకద్దుకోనూ లేక
తడి ఇంకిపోతూ...

చివరిగా తిరిగిన ఆ మలుపు
వంతెన విడిపోయిన చోట...

కాసేపలా సంధ్య ఎరుపు
పూసుకుంటూ తెల్లబడ్డ వెన్నెల...

ఈ చల్లదనం
మృత్యు స్పర్శలా తాకుతూ....

వదలిన కాగిత్తప్పడవల్నిండా
ఇన్నిన్ని జ్నాపకాలు మునుగుతూ...

కాలమిక్కడ ఓ కాలమిస్టులా
పెన్సిల్తో ఆకాశంపై నలుపు చేస్తూ...

నేలపై ఇన్నిన్ని
బలి పీఠాలను నిర్మిస్తూ....

గోరీలన్నీ ఒకే పేరుతో చెక్కి
ఓ గడ్డి పూవుతో అలంకరిస్తూ...

16 comments:

  1. వదలిన కాగిత్తప్పడవల్నిండా
    ఇన్నిన్ని జ్నాపకాలు మునుగుతూ...
    చక్కగా రాశారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్జీ...

      Delete
  2. బాగుంది వర్మ గారు..

    ReplyDelete
  3. బాగా రాసారండీ..:)

    ReplyDelete
  4. "కంటినీరింకిపోవడమే
    కనులకింత ఓదార్పుకదా...

    ఆకు నుండి జారిపడుతున్న
    చివరి బొట్టు దోసిలిలో...

    కళ్ళకద్దుకోనూ లేక
    తడి ఇంకిపోతూ..."

    ఇలా రాయడం మీ స్టైల్..
    నాకు భలే నచ్చిందండి:-)

    ReplyDelete
    Replies
    1. మీకు నా కవితా శైలి నచ్చినందుకు ధన్యవాదాలండీ పద్మార్పితగారూ...

      Delete
  5. చాలా బాగుందండి.. మీదొక ప్రత్యేకమైన శైలి

    ReplyDelete
    Replies
    1. నాదంటూ ఓ శైలిగా కాకుండా formless form గా రాద్దామనుకుంటున్నా యింకా రావడం లేదండీ..ధన్యవాదాలు Ramani Rachapudi garu..

      Delete
  6. మనకంటూ ఒక శైలి ఉండి అందరూ మెచ్చుకుంటున్నప్పుడు దాన్ని మార్చుకోవాలి అనుకోవడమే నాకు అర్థం కాలేదండి. కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. Nalkenduko ala oke frame workku limit kakudadani umtundi Aniketh. Thanq

      Delete
  7. వదలిన కాగిత్తప్పడవల్నిండా
    ఇన్నిన్ని జ్నాపకాలు మునుగుతూ..
    good poetry.

    ReplyDelete
  8. Replies
    1. థాంక్సండీ జలతారు వెన్నెలగారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...