నాకై నేను ఓ వ్యాపకంగా వున్నవాడిని
నేడు నేనన్నదే మరిచి నీవయ్యానని...
నింగినంటిన నేల బాసలు
కురిపించే వాన మబ్బునై తొలకరి వేళ
నీ ముంగిట ముత్యపు చినుకునై నేల రాలనా...
చిగురాకుల తొడిమనంటిన నీటి బిందువు
నీ చేతి వేలి స్పర్శతో కాంతివంతమై
నీ కనులలో ప్రతిఫలించి
నా గుండె గూటిలో దివ్వెవుకావా...
సఖీ
ప్రియతమా
యిలా ఏమని పిలిచినా
యింకా ఏదో మరో వేణు నాదమేదో
స్వరమై నీ చెవిలో మ్రోగాలని
అది నా గొంతులో పల్లవించాలని...
సఖీ
ReplyDelete"ప్రియతమా
యిలా ఏమని పిలిచినా
యింకా ఏదో మరో వేణు నాదమేదో
స్వరమై నీ చెవిలో మ్రోగాలని
అది నా గొంతులో పల్లవించాలని"
చాలా చాల నచ్చిందండి
మీకు నచ్చిందంటే పాసయినట్టే కదా పద్మాజీ...ధన్యవాదాలు.
Deleteనాకై నేను ఓ వ్యాపకంగా వున్నవాడిని
ReplyDeleteనేడు నేనన్నదే మరిచి నీవయ్యానని...
touching.
థాంక్యూ oddula ravisekhar గారూ..
Delete"నీ ముంగిట ముత్యపు చినుకునై నేల రాలనా..."
ReplyDeleteచాలా అద్భుతమైన కోటి భావాల ప్రేమ భావన అండీ ఇది.
కవిత బాగుంది.
చాలా థాంక్సండీ చిన్ని ఆశ గారు...
Deleteచాల అందంగా, ఆర్తిగా అక్షరాలను అలా వంపేసారు,
ReplyDeleteకవితా పాత్రలో...అభినందనలు.
ఓహ్..మీ అభినందనలకు సదా కృతజ్నుణ్ణి భాస్కర్జీ...
Deleteవర్మాజీ కవిత మీదైన శైలిలో శైలిలో చాలా బాగుంది, " చిగురాకుల తొడిమనంటిన నీటి బిందువు
ReplyDeleteనీ చేతి వేలి స్పర్శతో కాంతివంతమై
నీ కనులలో ప్రతిఫలించి
నా గుండె గూటిలో దివ్వెవుకావా... " నాగుండె గూటిలో దివ్వెవై.. నా కనులలో ప్రతిఫలించవా.. అంటే ఇంకా బాగుండేదేమో..మన్నించాలి మీ కవిత మచ్చలేని చందమామ ఇది కేవలం నా సలహా మాత్రమె సవరణ కాదని గమనించాలి.
మంచి సలాహానే కదా ఫాతిమాజీ...నేను అక్కడ అలా ఫీలయ్యా అంతే... యిలా నిర్మొహమాటంగా వుండే ఆత్మీయ సలహాలతోనే కదా మెరుగుపడేది..ధన్యవాదాలు..
Deleteవర్మగారు....స్త్రీ హృదయానికి పాదాకాంత్రుడ్ని అని చెప్పే ప్రయత్నంలో ఆమెనే దాసోహం చేసుకునే నేర్పుంది మీ ప్రేమకవితల్లో:)
ReplyDeleteధన్యవాదాలండీ సృజనగారు...కవిత అంతరంగాన్ని చదివేసారు కదా..:-)
DeleteSweet poem అండి వర్మ గారు. చిత్రం కూడా బాగుంది.
ReplyDeleteThank you very much for your sweet comment జలతారువెన్నెల గారు:-)
Delete