Sunday, July 15, 2012

అద్దం పెంకు..

ఇంత చిన్ని అద్దం పెంకు
గూటిలో...

చుట్టూ అలికి తెలుపు నలుపుల
ముగ్గు పెట్టిన మట్టి గోడ

చూరు పై తాటాకు
రెమ్మల రిబ్బను వేలాడుతూ...

వెదురు బద్దల తడిక హుందాగా
గోడకు చేరగిలబడి...

రెండు నెమలీకలు
అలా ముంజూరుకు గుచ్చి...

నుదుటిన ఇంత సింధూరం
ఎర్రగా సూరీడు బిళ్ళంత..

చిన్ని
అద్దం పెంకులో నా గుండె చిత్రం....

మసిబారనీకు
దీపపు సెమ్మెలా...

16 comments:

  1. అద్దం పెంకులో
    ఆ మోము అందంలో
    ఆమె శింగారంలో....
    గాంచితి మీ గుండె చిత్రం
    అందంగా మసిబారక మెరిసిపోతూ....
    picture Superb Varmagaru!

    ReplyDelete
    Replies
    1. వావ్..థాంక్సండీ మీ ఆత్మీయమైన స్పందనకు పద్మగారూ...

      Delete
  2. చాలా చాలా బాగుందండీ వర్మ గారు
    అద్దాన్ని పదిలం గా కాపాడుకోండి మరి..!
    verynice pic too..

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా సీత గారు...

      ధన్యవాదాలు..

      ఏలే లక్ష్మణ్ గారి పెయింటింగ్...

      Delete
  3. వర్మగారు!!!
    ఎంతో అందంగా మరెంతో పొందికగా ఒక సామాన్యగృహిణి తన ముత్తైదువ తనాన్ని మసిబారనీకు అని ఆ చిన్ని అద్దాన్ని అడుగుతున్నట్లు వున్న
    మీ భావన చాల బావుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పూర్వఫల్గుణి గారూ..

      Delete
  4. భావయుక్తంగా బాగారాసారండి!

    ReplyDelete
    Replies
    1. ఎందుకు అనికేత్ అబద్ధమాడుతారు.....

      Delete
    2. వర్మగారు...నేను అబద్ధమాడాను అని మీరంటే మిమ్మల్ని మీరనుకున్నట్లేనేమో:)
      రాయాలంటే భావం పొంగాలి అదిలేకుండా ఎవరు రాయలేరుకదా?
      అదేకదా నేనన్నది....తప్పైతే మన్నించండి మరి ఏదో తెలియని తనం!

      Delete
    3. బాగా రాసారండీ అంటె ఏదో అనిపించి అలా అన్నాను...అనికేత్ కు తెలియనితనమా??
      మన్నించడాలు అప్పడాలు మనకొద్దు...:-)

      Delete
  5. చాలాబాగుంది కవితకు తగ్గ పిక్.

    ReplyDelete
  6. varma gaaroo andamaina swchhamaina, muchhatainasoyagam kanipisthundi,

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలానే...ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...