ప్రతి క్షణం నీ తలుపు తడుతూనే వుంటా ఆర్తిగా...
కానీ నీవు తెరుచుకోవెందుకో??
రానన్న వారిని వెంట బర బరా ఈడ్చుకు పోతావు...
వస్తానన్న నన్ను గుమ్మానికీవలే వదిలేస్తావు...
ఎన్నాళ్ళిలా నిరీక్షించను??
ఎడారి తోవలో యింకిపోయిన నీటి చెలమలా...
కారడవిలో వెన్నెల కాంతి చొరబడని దారిలా...
చివరి నూనె బొట్టు కాలి కరిగిపోయిన వత్తిలా...
నీ గాఢ పరిష్వంగంలో హాయిగా శాశ్వతంగా నిదురపోవాలని ప్రార్థిస్తున్న నన్ను
యింత నిర్దయగా నీరవ నిశీధిలో వదిలేయడం భావ్యమా??
మృత్యు స్పర్శలోని హిమత్వాన్ని నా నుదుటిపై ముద్రించరావా...

ప్రాణం ఇస్తానంటే ఓకే అంటుందేమో కలలయామిని :-)
ReplyDeleteకానీ..ఇలా శాశ్వితంగా దూరమౌతానంటే నాట్ ఒకే :-(
Picture & presentation are perfect.
అవునా!! నిజమేనా??
Deleteనచ్చినందుకు థాంక్యూ పద్మార్పిత గారూ..
చాలబావుంది కవిత వర్మగారు
ReplyDeleteThank you పూర్వ ఫల్గుణి గారు..
Deleteధన్యవాదాలు పూర్వఫల్గుణి గారు..
Deleteబాగుందండి వర్మ గారు.
ReplyDeleteథాంక్సండీ వెన్నెల గారు...
Deletechakkaga undandi,
ReplyDeleteథాంక్యూ భాస్కర్జీ...
DeleteI Can See Definition Of Love In Your Poetry Sir!
ReplyDeleteఓహ్..థాంక్యూ వెరీ మచ్ అనికేత్..
Deleteమృత్యు స్పర్శలోని హిమత్వాన్ని నా నుదుటిపై ముద్రించరావా...
ReplyDeleteమంచి కవితా ప్రయోగం .