Thursday, July 12, 2012

దగ్గరై దూరంగా...


ప్రతి క్షణం నీ తలుపు తడుతూనే వుంటా ఆర్తిగా...
కానీ నీవు తెరుచుకోవెందుకో??

రానన్న వారిని వెంట బర బరా ఈడ్చుకు పోతావు...
వస్తానన్న నన్ను గుమ్మానికీవలే వదిలేస్తావు...

ఎన్నాళ్ళిలా నిరీక్షించను??
ఎడారి తోవలో యింకిపోయిన నీటి చెలమలా...
కారడవిలో వెన్నెల కాంతి చొరబడని దారిలా...
చివరి నూనె బొట్టు కాలి కరిగిపోయిన వత్తిలా...

నీ గాఢ పరిష్వంగంలో హాయిగా శాశ్వతంగా నిదురపోవాలని ప్రార్థిస్తున్న నన్ను
యింత నిర్దయగా నీరవ
నిశీధిలో వదిలేయడం భావ్యమా??

మృత్యు స్పర్శలోని హిమత్వాన్ని నా నుదుటిపై ముద్రించరావా...

12 comments:

  1. ప్రాణం ఇస్తానంటే ఓకే అంటుందేమో కలలయామిని :-)
    కానీ..ఇలా శాశ్వితంగా దూరమౌతానంటే నాట్ ఒకే :-(
    Picture & presentation are perfect.

    ReplyDelete
    Replies
    1. అవునా!! నిజమేనా??
      నచ్చినందుకు థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  2. చాలబావుంది కవిత వర్మగారు

    ReplyDelete
    Replies
    1. Thank you పూర్వ ఫల్గుణి గారు..

      Delete
    2. ధన్యవాదాలు పూర్వఫల్గుణి గారు..

      Delete
  3. బాగుందండి వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ వెన్నెల గారు...

      Delete
  4. Replies
    1. ఓహ్..థాంక్యూ వెరీ మచ్ అనికేత్..

      Delete
  5. మృత్యు స్పర్శలోని హిమత్వాన్ని నా నుదుటిపై ముద్రించరావా...
    మంచి కవితా ప్రయోగం .

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...