ఎత్తుగా ఓ పర్వతపు సానువులా
నిలువెత్తుగా...
శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...
ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...
చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...
ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...
ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...
యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...
ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....
ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....
నిలువెత్తుగా...
శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...
ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...
చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...
ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...
ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...
యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...
ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....
ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....
బాగుందండీ :)
ReplyDeleteరాయి పైన అయితే జ్ఞాపకం స్థిరం గా ఉంటాయి...:)
నిజమే కదా...:-)
Deleteధన్యవాదాలు సీత గారూ..
ఈ రాతి జ్ఞాపకాలన్నీ,.... గుండెలపై కూలబడ్డ బరువుతనంతో....
ReplyDeleteమంచి పదప్రయోగాలతో చక్కని కవిత.
thank you Bhaskarji..
Delete"రాతి జ్ఞాపకాలు " ఎక్కడా చదవలేదండి.. చాలా బాగుంది ఈ కవిత కొంచెం కొత్త గా!!
ReplyDeleteఅందుకే కొత్తగా యిలా శిలలా...
Deleteథాంక్యూ వెన్నెలగారూ...
చాలా బాగుంది వర్మగారు...
ReplyDeleteధన్యవాదాలు సాయి గారు..
Deleteయుగాల మలుపలన్నీ........ మంచి ప్రయోగం.ఇంతకు ముందు ఈచిత్రాన్ని ఎక్కడో చూసాను.కవిత నేపధ్యము అర్థమయింది.good poetry.
ReplyDeletethank you oddula ravisekhar gaaru.. ee pic google lode...
Delete