Tuesday, July 17, 2012

రాతి జ్ఞాపకం..


ఎత్తుగా ఓ పర్వతపు సానువులా
నిలువెత్తుగా...

శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...

ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...

చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...

ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...

ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...

యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...

ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....

ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....

10 comments:

  1. బాగుందండీ :)
    రాయి పైన అయితే జ్ఞాపకం స్థిరం గా ఉంటాయి...:)

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా...:-)
      ధన్యవాదాలు సీత గారూ..

      Delete
  2. ఈ రాతి జ్ఞాపకాలన్నీ,.... గుండెలపై కూలబడ్డ బరువుతనంతో....
    మంచి పదప్రయోగాలతో చక్కని కవిత.

    ReplyDelete
  3. "రాతి జ్ఞాపకాలు " ఎక్కడా చదవలేదండి.. చాలా బాగుంది ఈ కవిత కొంచెం కొత్త గా!!

    ReplyDelete
    Replies
    1. అందుకే కొత్తగా యిలా శిలలా...
      థాంక్యూ వెన్నెలగారూ...

      Delete
  4. చాలా బాగుంది వర్మగారు...

    ReplyDelete
  5. యుగాల మలుపలన్నీ........ మంచి ప్రయోగం.ఇంతకు ముందు ఈచిత్రాన్ని ఎక్కడో చూసాను.కవిత నేపధ్యము అర్థమయింది.good poetry.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...