Sunday, July 1, 2012

రెండు ప్రపంచాలు...

ఎప్పుడూ
నీదో ప్రపంచం
నాదో ప్రపంచం...

ఒకే గాలి పీలుస్తున్నా
చెరొకరి వాసనలు వేరు...

ఒకే నీటిలో ఈదులాడుతున్నా
చెరొకరి పాయలు వేరు...

ఒకే గదిలో ఎదురెదురుగా వున్నా
యిద్దరి మధ్యలో గోడ...

ఒకే దిండుపై రెండు దేహాలు వున్నా
అతకని తలపులు...

ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయినా
మనసులు చెరో్వైపు...

ఈ కలవని కలల కలవరింపు
అలుపెరుగని ఈ పయనం ఎటువైపు?

ఎప్పుడూ నిట్టూర్పుల అలసటతో
విరామమెరుగని ఈ ప్రస్థానం ఎందాక??

ఎగురుతున్న గాలి పటాలను
కలపలేని దారాల విఫలయత్నం కదా?

సాగనీ ఈ ముసుగు యుద్ధం
యింక విరమణ మరణయాతన కాదా??

13 comments:

  1. chaalaa bhaaga raasaarandi, nice one,
    keep writing.
    if you have time,plese visit " ee bhandham drudamainadi" (http://bhaskar321.blogspot.in/2012/06/blog-post_12.html)in my blog.
    thanking you sir.

    ReplyDelete
  2. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం మీ కవితలాగా ఉందండి .
    ఒకే గాలి పీలుస్తున్నా
    చెరొకరి వాసనలు వేరు.విభిన్నంగా ఉందండి ఈ ప్రయోగం.
    సరళమైన వాస్తవికమైన కవిత.

    ReplyDelete
    Replies
    1. @oddula ravisekhar గారూ ధన్యవాదాలండీ..

      Delete
  3. ఏంటో గత రెండురోజులుగా బ్లాగ్ మిత్రులంతా ఇద్దరు ఒకటికాదు, ఒకటైన ఇరువురు అంటూ కవితలల్లేస్తున్నారు?
    ఏదైనా పోటీనా? అయినా వేటికవే విభిన్నంగా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. @ప్రేరణ గారూ అవునా! థాంక్సండీ...

      Delete
  4. వర్మ గారు, కవిత బాగుందండి.
    కాని ఒకటి చెప్పనా?
    ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయలకు మరొకరు విలువ ఇస్తూ, ప్రేమ గా ఉంటే చాలండి.పూర్తిగ మనసున మనసై, బ్రతుకున బ్రతుకై జంటలు ఎన్ని ఉంటాయండి? సహచర్యం వలన కొన్ని సంవత్సరాla ku ఒక గట్టి బంధం తప్పక ఏర్పడుతుంది.

    ReplyDelete
    Replies
    1. వెన్నెలగారూ ఆశిద్దాం అలానే...బాగుందన్నందుకు ధన్యవాదాలండీ..

      Delete
  5. ఇది నిజమైనా ఒప్పుకోడానికి ఇష్టపడనివారే చాలామంది. ఒకరికొరం ఉన్నామంటూ మనసుపై మేలిముసుగు వేసుకుని జీవిస్తున్నవారెందరో.Nice post Varmaji.

    ReplyDelete
    Replies
    1. Thank you Padmarpitagaru..మేలి ముసుగు తొలగించి చూడడమే మన పని కదా...

      Delete
  6. బిన్న ద్రువాలలా కలవని మనసులు కలసి జీవిస్తున్న మనుషులు. ఇది ఎన్నో జీవితాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న జీవన క్రీడ. సర్, చాలా బాగా రాసారు. ( మీ కొత్త కవితకు కామెంట్ పెట్టాలంటే కర్సర్ కామెంట్ బాక్స్ లో రావటం లేదు, కొంత సమయం తర్వాత వీలవుతుంది, కనుక ఆలస్యంగా కామెంట్ పెడుతున్నాను.)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వెరి మచ్ ఫాతిమాజీ...
      శ్రమ అయినా కామెంట్ రాసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు..

      Delete
  7. బాగుంది వర్మ గారు..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...