Saturday, October 2, 2010

నేనూ మా నాన్నగారూ ఓ ర్యాలీ సైకిల్



బడిలో ప్రార్థనకు ముందుగా
గేటు వద్ద దింపకపోతే తన
కొడుకు అరచేయిపై పడే ఎఱ
చారలనూహించుకొని
అప్పుడే తిన్న పేగుల్నొప్పిని
పైపంటితో భరిస్తూ స్పీడుగా
వెళ్ళలేనని మొరాయిస్తున్న
సైకిల్ పెడల్ పై శక్తినంతా పెట్టి
తొక్కిన మీ పాదాలను
నమస్కరించకుండా ఎలా వుండగలను
నాన్నగారూ..

సైకిల్ సొంతంగా తొక్కితే
పడి మోకాలుపై చర్మం వూడితే
ఇంకెప్పుడూ సైకిల్ తొక్కనివ్వని
మీ అవ్యాజ ప్రేమ
నన్నిప్పటికీ దానికి దూరం చేసిందని
తలచుకున్నప్పుడంతా నవ్వే
మిమ్మల్ని చూస్తూ
నా భయానికి నాకే సిగ్గేస్తోందిప్పుడు!

హాయిగా మీ గుండెలపై వాలి
ఇప్పటికీ వేళ్ళమధ్య రోమాలనిరికించి
ఆడుతూ నిదరపోవాలనివుంది...

21 comments:

  1. కుమార్ గారూ:

    చాలా మంచి కవిత.

    ఆ ర్యాలీ సైకిల్ నాకూ మధుర/ విషాద జ్నాపకమే.

    ReplyDelete
  2. మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. మీలా గుర్తుంచుకున్న కొడుకుని కన్నందుకు మీ నాన్నగారు కూడా ఒకవిధంగా అదృష్టవంతులే.

    -సుధాకర్

    ReplyDelete
  3. కుమార్ గారూ,
    కాదేదీ కవితకనర్హం అని మళ్ళీ ప్రూవ్ చేశారు. మీకు చిన్నప్పుడు ఎంతో తోడుగా నిల్చిన ఆ సైకిల్‍్కి మీ భావావేశంతో సముచిత స్తానాన్నే ఇచ్చారు.
    దాదాపు మనందరికి సైకిల్‍తో ఇలాంటి అనుభవాలేఉన్నా మీరువ్యక్తపర్చిన తీరు అమోఘం. keep doling out your feelings...

    ReplyDelete
  4. అఫ్సర్ సార్ మీ కామెంటు పొందినందుకు చాలా సంతోషంగా వుంది..

    ReplyDelete
  5. @సుధాకర్:ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం సార్. ధన్యవాదాలు..

    ReplyDelete
  6. @vaasudev: మరిచిపోలేని జ్ఞాపకాలను ఇలా మీతో పంచుకోగలగడం నా అదృష్టం సార్.

    ReplyDelete
  7. మిత్రమా ,నీ కవితతో -తన హీరోయిజాన్ని నాకిచ్చి తను జీరో అయిపోయిన నా హీరో సైకిలును గుర్తు చేశావు .అందరిలాగా వున్న నన్ను కొందరిలోని గొప్పతనాన్ని చూపించడానికి తన ఊపిరిని నాకు ఎన్నో సార్లు దార పోసిన నా మిత్రమా 'హీరో ',నీకు నా కృతజ్ఞత ఏవిదంగా చెప్పుకోను .మానవహక్కుల నేత 'బాలగోపాల్ 'గారితో వున్న ఆ తియ్యటి జ్ఞాపకము నువ్విచ్చినదే కదా !నిన్నెట్లా మరువను .నువ్వున్నా వన్నభరోసా తోనే కదా ఎన్నో రాత్రులు ఎన్నెన్నో విషయాల మీద మేదోమదనము చేసి ,కాలేజికి సమయానికి వెళ్ళింది -నీ ఋణం నేనెట్లా తీర్చుకునేది .ఆ నాడు నీవిచ్చిన మధుర జ్ఞాపకాలు ,ఈ నాడు నాకున్న కార్లు, మోటార్ సైకిళ్ళు యివ్వలేకున్నాయి -నిన్ను పొందిన నేను ఎంత అదృష్టవంతుణ్ణి .చాలా రోజులయింది మిత్రమా నిన్ను చూసి నీ కోసం దసరా పండుగకు ఊరొచ్చే ఈ నీ మిత్రునుకి ఏమిస్తావు ............?
    వర్మ గారు !సైకిలు నేర్చుకునే టప్పుడు కలిగే చిన్న చిన్న గాయాలను ,వోర్చుకుంటే ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను మనము పొందవచ్చు .మీకు మా (నా +మా హీరో )తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ,మీ మిత్రుడు -మల్లిక్

    ReplyDelete
  8. మల్లిక్ సార్ మీ హీరోతో వున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకిప్పటికీ అదో బ్రహ్మపదార్థమైంది. ఏంచేస్తాం.. అలా గడిచిపోయాయి రోజులు.

    ReplyDelete
  9. రవి వీరెల్లిNovember 02, 2010 6:00 AM

    చాలా బాగుంది.

    ReplyDelete
  10. రవి వీరెల్లి గారు ధన్యవాదాలండి..

    ReplyDelete
  11. తమ్ముడూ మొదటి నాలుగు లైన్లూ చద్వినపుడే నా వళ్లు చల్లగా అయిపోయింది..ప్రతి తండ్రికీ తన బిడ్డలపై ఉండే మమకారం, బాధ్యత అటువంటివి..ఎక్కువగా అమ్మనీ, అమ్మ ప్రేమనీ వర్ణిస్తారు..గానీ తండ్రి స్థానం ప్రతి మనిషి జీవితం లో ఎంత గొప్పదో నీ మొదటి పది వాక్యాలు చెబుతున్నాయి...అభినందనలు తమ్ముడూ !

    ReplyDelete
  12. చాలా బాగా చేప్పరాండి....మరువలేని జ్ఘాపకాలని మధురంగా చేప్పారు.....

    ReplyDelete
  13. కుమార్ వర్మగారూ...

    మీ కవిత ఆసాంతం మా నాన్నను గుర్తుకు తెచ్చింది. సంవత్సరం క్రితం ఆయన్ని కోల్పోయిన మేము ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ ఆయన జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతున్నాం. నాన్న అనే పేరు వింటేనే తెలియకుండానే కళ్లనీరు ఉబుకుతుంది. అనారోగ్యం ఆయన్ని మాకు దూరం చేసింది.. ఆయన లేని మేము ఏదోలా బ్రతికేస్తున్నాం...

    మీ కవిత మా నాన్నకు అలా కళ్లముందు నిలబెట్టింది..

    (మీకు వీలయితే నాన్నగారి మొదటి సంవత్సరీకం సందర్భంగా నేను సిలికానాంధ్రవారి సుజనరంజని పత్రికకు పంపించిన వ్యాసం.. నా బ్లాగులో పోస్టు చేశాను. చూడగలరు..

    లింక్ : http://kaarunya.blogspot.com/2011/02/blog-post.html )

    ReplyDelete
  14. p.ramakrishna raoMarch 26, 2011 11:43 AM

    నేను చదివిన మంచి కవితల్లో ఇది ఒకటి వర్మగారూ.భావాన్ని ఇంత సూటిగా,హృదయాన్ని కదిలించేలా రాసినందుకు, అభినందనలు. ఇలా జీవితం మొత్తంలో పది కవితలు రాయండి చాలు.

    ReplyDelete
  15. అసలు నాన్నారంటేనే అంత. అమ్మ ప్రేమతో పోలిస్తే కొబ్బరికాయలా పైకి కఠినం అనిపించినా లోపల తీయని నీళ్ళలాంటి మనసు.

    క్షమించండి..కళ్ళలో నీటి పొరతో మసకేసి ఇంతకు మించి రాయడానికి వీలుపడట్లేదు.

    ReplyDelete
  16. @జ్యోతక్క, @శోభారాజు, @బాబు, @రామక్రిష్ణారావు, @శంకర్ గార్లకు ధన్యవాదాలు.. మీ అందరి అభినందనలతో మరింతగా రాయడానికి ప్రయత్నిస్తా...

    ReplyDelete
  17. అద్భుతంగా రాశారు.

    ReplyDelete
  18. అద్భుతంగా ఉంది కవిత.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...