Sunday, November 7, 2010

మాయల ఫకీరులు




ఏదో ఓ పెద్ద సునామీ కెరటం
ముంచెత్తడానికి
ముందున్నట్లు ఈ ప్రశాంతత..

ఆకాశమంత కమ్ముకున్న
మబ్బులు రైతన్న
మోముపై చూస్తూ
భూమిలోకి కుంగిపోతున్న
అనుభూతి...

కోతకొచ్చిన పంట 'జల'
వరదపాలౌతుందన్న
బెంగతో గొంతులో
ముద్ద దిగక
ఊపిరాడనితనం...

ఇంతలొ...

ఓ అరచేయి అందరి
నెత్తిపై గట్టిగా మోదుతూ
మోకాళ్ళపై మోకరిల్లమని
ఆజ్నాపిస్తున్నట్లు...

నోటికందిన ముద్దను
నల్లరెక్కల గెద్ద ఏదో తన్నుకు
పోతున్నది!

రెక్కలకింద దాగిన పిల్లలను
మరింతగా దాచుకునేందుకు
ఒదిగిపోతున్న కోడి
ఈకల సందుల్లో దూరుతున్న
సాటిలైట్ చూపుతో
సిగ్గుతో చచ్చిపోతున్నది..

మూసుకుపోతున్న
బాహ్య ఆధార దారులతో
నిరుద్యోగి గుండె సంద్రమౌతున్నది..

ఇక్కడి ధాతువులన్నీ
చాప చుట్టే పన్నాగంతో
వచ్చిన ఈ మాయల ఫకీరు
చిలకను కొట్టేందుకు
శిలకోలలెక్కుపెడుదాం...

4 comments:

  1. నోటికందిన ముద్దను
    నల్లరెక్కల గెద్ద ఏదో తన్నుకు
    పోతున్నది!

    ఎంత బాగ రాస్తున్నారు కెక్యూబ్ గారు! కవితలు రాయడంలో ఎంతయినా మీకు మీరే సాటి..చాల బాగుంది కవిత

    ReplyDelete
  2. శిలకోలతో మాయల పకిరులకు ఏమి కాదేమో !ఇంకేదైనా ఆలోచించాలి ......

    ReplyDelete
  3. @అశోక్ పాపాయిః మీ అభిమానానికి ధన్యవాదాలు.
    @గాజులః సార్ మీరన్నది నిజమే.. కానీ ఆయుధం రూపమేదైనా అది మన ప్రతిఘటనా శక్తిని చూపేది కావాలన్నది... మీ స్పందనకు ధన్యవాదాలు..

    ReplyDelete
  4. This is mail from N.S.Murty Sir on this post..
    Dear Friend,

    Here is my response for your poem maayala phakeerlu. Because of space constraint I could not put the whole of it:

    I appreciate the text and tone of the poem and I also express my helplessness in the present context of politics. There is exuberance at striking a chord with US but at what cost to a reliable ally in Russia, only time can tell. We have become more market based economy than value based. That is why governments are lenient to open shameless exploitation of natural resources by elected representatives. Coailition compulsions and flair for disintegration by people in the name of language and region have onlyadded fuel to the fire. This economic calamity is not going to ease in near future.
    My congratulations to you for your angst.

    Thanks Murty Sir..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...