ఎక్కడ సాహితీ సభలు జరిగినా తప్పక హాజరై తన కవితను వేదికపై వినిపించే 'అల' ఈ మధ్యాహ్నం కామెర్ల వ్యాధితో బాధ పడుతూ చనిపోవడం ఉద్యమ కవితా రంగానికి, ఉత్తరాంధ్ర సాహితీ మిత్రులకు తీరని నష్టం. మినీ కవితలు చాలా రాసిన 'అల' జనసాహితీ నిర్మలానంద గారి ప్రోత్సాహంతో దీర్ఘ కవితలు రాయడం ఆరంభించి ఈ మద్యనే నిప్పులవాగు, మట్టిచెట్టు పిట్ట బజినిక, అలల సవ్వడి అన్న దీర్ఘ కవితా సంకలనాలు ప్రచురించారు. మృదు స్వబావిగా, ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరించే అల తన కలం ద్వారా రాజ్యం పట్ల, దాని అణచివేత ధోరణి పట్ల తీవ్ర వ్యతిరేకతను, ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతిని, అణగారిన వర్గాల పట్ల ఆప్యాయతను కలిగివుండే వారు. తన సొంతవూరు అన్నంరాజు పేటలో ఓ చిన్న స్కూలును నడుపుతూ సాధారణ జీవితం గడుపుతూ తన కవితల ద్వారా, రచనల ద్వారా సాహితీ మిత్రులతో పాటు ఇక్కడి ప్రజల ఉద్యమాలలో పాలుప౦చుకు౦టూ అందరికీ చేరువైన వారు. అనారోగ్యంతో ఇలా అందరినీ విడిచి పోవడం ఎవరికీ నమ్మశక్యంగా లేదు. 'అల' కలల సవ్వడి ఇంత హఠాత్తుగా ఆగిపోవడం మాకు తీరని బాధను మిగిల్చింది.
అల కవితా వాక్యాలు కొన్ని:
నాగలి మేడిని అదిమిపెట్టే వేలే
తెల్లకాగితం మీద ముద్ర వేసినప్పుడు
కొరడా కర్రని బిగిసిపట్టిన చెయ్యే
అప్పులకోసం అర్రులు చాచినప్పుడు
యుద్ధం అనివార్యం..
౨. విత్తనం కడుపులో స౦కర౦ సు౦కు పుట్టి౦ది
బహుళ జాతి బలాత్కరి౦చి
టెర్మినేటర్ ఎబార్షన్ చేసి0ది
రైతు స0క్షోభం సర్వవ్యాప్తమై
మట్టిని మేల్కొలిపి0ది...
ఇప్పుడు మన యుద్ధం
ఒక్క బుగత మీదే కాదు
బుగతకు బాసటగా వున్న
ఈ రాజ్యం మీద మాత్రమె కాదు
మన ఆలోచనల మీద,
మన సంస్కృతి మీద
సాగుబడి మీద,
మన వృత్తుల మీద
మన వ్యాపారం మీద,
మన సకల ఆహారపు అలవాట్ల మీద
చావుదెబ్బతీశాడే...
వాడిమీద,
వాడి కుట్ర మీద యుద్ధం చెయ్యాలి..
ఇలా రాజ్యం, దానికి వత్తాసుగా వున్న సామ్రాజ్యవాద౦ మీద తన యుద్ధాన్ని ప్రకటి౦చిన 'అల' తన యుద్దాన్ని ఇలా అర్థా౦తర౦గా వదిలేసి వెళ్ళిపోవడం సాహితీ ఉద్యమానికి ఆశనిపాతం.. తను జన సాహితీ సంస్థ బాధ్యతలలో వున్న మిగతా సాహితీ సభలకు అలాగే విరసం సభలకు కూడా హాజరై తన స౦ఘేభావాన్ని, మిత్రత్వాన్ని కొనసాగించే అల ఇలా దూరమవ్వడం బాధాకరం..
జోహార్ కా.అల...
కా.అల ఆశయాలను కొనసాగిద్దాం...
అల కవితా వాక్యాలు కొన్ని:
నాగలి మేడిని అదిమిపెట్టే వేలే
తెల్లకాగితం మీద ముద్ర వేసినప్పుడు
కొరడా కర్రని బిగిసిపట్టిన చెయ్యే
అప్పులకోసం అర్రులు చాచినప్పుడు
యుద్ధం అనివార్యం..
౨. విత్తనం కడుపులో స౦కర౦ సు౦కు పుట్టి౦ది
బహుళ జాతి బలాత్కరి౦చి
టెర్మినేటర్ ఎబార్షన్ చేసి0ది
రైతు స0క్షోభం సర్వవ్యాప్తమై
మట్టిని మేల్కొలిపి0ది...
ఇప్పుడు మన యుద్ధం
ఒక్క బుగత మీదే కాదు
బుగతకు బాసటగా వున్న
ఈ రాజ్యం మీద మాత్రమె కాదు
మన ఆలోచనల మీద,
మన సంస్కృతి మీద
సాగుబడి మీద,
మన వృత్తుల మీద
మన వ్యాపారం మీద,
మన సకల ఆహారపు అలవాట్ల మీద
చావుదెబ్బతీశాడే...
వాడిమీద,
వాడి కుట్ర మీద యుద్ధం చెయ్యాలి..
ఇలా రాజ్యం, దానికి వత్తాసుగా వున్న సామ్రాజ్యవాద౦ మీద తన యుద్ధాన్ని ప్రకటి౦చిన 'అల' తన యుద్దాన్ని ఇలా అర్థా౦తర౦గా వదిలేసి వెళ్ళిపోవడం సాహితీ ఉద్యమానికి ఆశనిపాతం.. తను జన సాహితీ సంస్థ బాధ్యతలలో వున్న మిగతా సాహితీ సభలకు అలాగే విరసం సభలకు కూడా హాజరై తన స౦ఘేభావాన్ని, మిత్రత్వాన్ని కొనసాగించే అల ఇలా దూరమవ్వడం బాధాకరం..
జోహార్ కా.అల...
కా.అల ఆశయాలను కొనసాగిద్దాం...
అల కలం ఆగిపోయినా,
ReplyDeleteఅల కలలసంద్రం ఇంకిపోదు.
అల అమర్ రహే!
కేక్యూబ్‌గారు ఒక మంచికవి చక్కని
కవిత్వం అందించారు.థాంక్యూక్యూబ్..
చాల భాదకరమైన విషయండి. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుజేస్తూ జోహర్ జోహర్ కవిత పుత్రునికి....
ReplyDeleteమిత్రమా వర్మా! 'అల' నిష్క్రమణ వార్త చాల బాధించింది! 'అల' మళ్ళీ మళ్ళీ తిరిగి లేస్తుందని నా బలమైన నమ్మకం. రాజ్యానికి, దోపిడికి వ్యతిరేకంగా వినబడే గొంతులు అరుదవుతున్న ఈ కాలంలో 'అల' వెళ్ళిపోవడం విషాదం. 'అల' కుటుంబానికీ, కావల్సిన వాళ్ళకీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజెయ్యండి.
ReplyDeleteనారాయణస్వామి.
Very sorry to hear it.
ReplyDeleteఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక బలమైన కలం ఆగిపోయింది.
ReplyDeleteCOM| ALA AMAR RAHE
ReplyDeleteకవి అల హఠాన్మరణం పట్ల స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteAla nippulavagunu nene munduga smeeksha chesanu mamanchi mithrudu monna kritham somavaram andhrabhumilo ala ki nivali rasindi vachindi. ala smrithilo ippudu oka kavitha sankalanam theddamani monna pinalagarra ramakrishnatho kuda matadamu appalnaiduki chayaraj gariki kuda cheppam. nissabda yodhudu man ALA
ReplyDeletejagaddhatri గారు అల స్మృతిలో ఒక కవితా సంకలనం తెస్తున్నారని తెలిసి చాలా సంతోషం.. ధన్యవాదాలు..
ReplyDelete