Thursday, April 19, 2012

తెల్ల మందారం..



ఇంటి ముంగిట
గేటు పక్కగా ఏపుగా
పెరిగిన నీలపు
శంఖం పూల తీగె
స్వాగతం పలుకుతూ...

ఆమె వున్నదన్న
గుర్తుగా ఆకులపై
తడి బిందువులు
మెరుస్తూ...

ఆ లేలేత తొడిమలంటిన
నీటి బిందువులను
తాకుతూ
మెల్లగా తెరుచుకున్న గేటు

నైట్ క్వీన్ పరిమళంతో
పాటు బొండు మల్లెలూ
మురిపిస్తుంటే....

పాదాలను చల్లగా
స్పృశిస్తూ
నడచి వచ్చిన
అలసటను
మాయం చేస్తూన్న
పచ్చిక తడిదనం....

ఆ పక్కగా
విరిసిన రేకు మందారం
పసుపుగా
ఆమె పెళ్ళి చీరను
గుర్తుకు తెస్తూ...

మెట్ల పక్కగా
ఎదిగిన సన్నజాజి తీగ
మెడ దగ్గర తాకుతూ
ఆమె ఊపిరి
స్పర్శనిస్తూ..

ఇంతలో
తెరుచుకున్న
తలుపులోంచి
తెల్ల మందారంలా
ఆమె మొఖం...

పాదాల  కింద
వాడి రాలిన 
మల్లియలు
నీలంపూలు....

ఆ పొదరింట
ఒక్కసారిగా 
నేను
నేలలో
ఇంకినట్టై....

12 comments:

  1. "ఆమె వున్నదన్న
    గుర్తుగా ఆకులపై
    తడి బిందువులు
    మెరుస్తూ..." మంచి భావుత్వపు భావజాలం వర్మాజీ...అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ మెప్పుతో మరింత స్ఫూర్తిని పొందా వాసుదేవ్జీ...ధన్యవాదాలు..

      Delete
  2. పూలచెండుతో కొడితే కూడా బొప్పికడుతుంది
    మనసున్నవాడికి అని మెత్తగా చెప్పారు వర్మగారు!
    పరిమళాలని ఆస్వాదిస్తున్న మనసుమూలని తాకింది
    మీ ఈ..........తెల్లమందారం!!!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన ఆత్మీయ పరిమళభరితమైన స్పందన మనసు మూలను తాకింది..ధన్యవాదాలు పద్మార్పితగారు..

      Delete
  3. తెల్ల మందారానికి పరిమళం చేకూర్చారు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ...

      Delete
  4. ee bhavukatanu, ee bhaavaalanu kajeyyalani anipistundi okkosari ;-) mettati pada vinyasam...vechaga gunde nu takindi varma ji...

    ReplyDelete
    Replies
    1. మీ కవితాత్మీయ స్పందనకు ధన్యవాదాలు విజయభాను మేడం...

      Delete
  5. చాలా బాగుంది వర్మ గారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జలతారువెన్నెలగారూ...

      Delete
  6. వస్తువు ఎత్తుగడ బావుంది వర్మ గారు - కానీ కొన్ని ప్రతీకలు నాకు కళ్ళకి కట్టట్లేదూ మరి?

    'నేను వేళ్ళు
    నేలలో
    ఇంకినట్టై....'

    వేళ్ళు నేలలోకి పాదుకుంటాయి కదా? 'నేలలోకి వేళ్ళూనిన వృక్షం' లేదూ 'పాతుకుపోయిన మొక్కలా నిలిచిన నేను' అన్నది మీ భావానికి నా భాష్యం.

    ReplyDelete
  7. ఎన్నాళ్ళకి మరువపు గుభాళింపు..మీరన్న భాష్యాన్నే ఇలా చెప్దామని...ధన్యవాదాలు ఉషగారూ..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...