Friday, April 13, 2012

కరువు


తొలకరి చినుకు
నేలను తాకి చుర చుర మంటూ ఇంకి
మట్టి పరిమళం ముక్కును తాకగానే
పలుగూ పారా భుజానేసుకొని
నాగలి కఱుకు పసుపు పూసి
నేల తల్లికి దండం పెట్టి దుక్కి దున్నే రైతు
నేడు కన్నతల్లిని.. వున్న వూరునూ  వదిలి
తనను తాను గోనె సంచీలో వేసుకొని రైలిక్కి పోతున్నాడు...

నలుగురికి అన్నం పెట్టిన చేతులు
నేడు పదుగురికి దండంపెట్టి
నెత్తురు కక్కుతూ కాంక్రీటు అరణ్యాలలో
గమేలాగా మారి పోయాడు...

పల్లె నేడు
పంట కరవుతోనే కాదు
మనుషుల కరవుకూ గురై
ముళ్ళ తుమ్మవనమౌతోంది...

No comments:

Post a Comment

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...