Saturday, April 21, 2012

లెనిన్...

 
లెనిన్..

ఈ పేరు వినగానే
ఓ నదో పర్వతమో
సంద్రమో
ప్రదేశమో
దేశమో
గుర్తుకు వస్తుందా...

లెనిన్
ఈ పేరు వినగానే
ఎక్కడో ఈ పుడమి
తల్లి పురిటి నొప్పులు
పడుతూ కలలు కన్న
ఓ నూత్న మానవుని
కన్నదన్నది
స్ఫురిస్తుంది కదూ...

ఒక్కడే
అయినట్టు
వినిపించిన పేరు
'లెనిన్'
కోట్లాది మంది
బోల్షివిక్ వీరులందరికి
సర్వనామమయినది...
...

అవును
వాళ్ళంతా కల్సి
నిన్ను ఓ విగ్రహమనుకొని
వాళ్ళ దేవునిలా
రాతిలో వున్నావనుకొని
కూల్చేసి
క్రేన్లతో ఎత్తి పారేసి
ఊపిరి పీల్చుకొని
పేంటు జేబుళ్ళో
చేతులు పెట్టుకు పోయారు...

హహహహహ
నువ్విప్పుడు
ఇక్కడి
గోండు చెంచు
కోందులు జాతాపు సవర్లు
దళితులు ఆదిమ తెగలందరి
చేతులలో ఆయుధమై
గురిచూస్తున్నావని
వాడికెరుకలేక పోవడం
చూసి ముసి ముసిగా
నవ్వుతున్నావు...

లెనిన్
ఆ కాలం వీరుడే కాదు
ఈ కాలం సాయుధుడు కూడా...

జోహార్ జోహార్
కా.లెనిన్...

(కా.లెనిన్ జయంతి సందర్భంగా)

4 comments:

  1. వారి స్మృతిపధంలో మనం...

    ReplyDelete
    Replies
    1. అభివందనాలు పద్మార్పిత గారూ..

      Delete
  2. Replies
    1. Thanks for your support జలతారువెన్నెలగారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...