నేను నీ కోసం
నా ఊపిరి చివరాఖరి వరకు
వేచి వుంటానన్న
ప్రమాణం తెలిసే యిలా
ప్రశ్నిస్తావా...
నీకోసం
వేయి జన్మలైనా వేచి వుంటా కదా...
మన మధ్య వున్నది
ఒట్టి వాంచకాదు కదా..
ఆత్మ యోగ సంయోగం
కదా...
కాలం కరిగిపోనీ
భూమి సంద్రం ఏకమవ్వనీ
ఆకాశం నేలలో ఇంకనీ
ఎనిమిది దిక్కులూ ఏకమవ్వనీ
ఏమైనా కానీ
నీ కోసం వేచి వుంటా నేస్తం..
నీ పాట పల్లవినౌతూ..
మాటలన్నీ కలిపి ఒకే పల్లవైన వేళ...
చరణాలన్నీ నీ శరణుజొచ్చిన వేళ...
నేనంటూ ఏమీ మిగలని వేళ...
ఇలా
నన్ను ఒంటరిని చేసి
నీ చూపుల కంటి చివర
కాటుక కరిగి
నా చిత్రం
కరిగిపోవాల్సిందేనా...
చిత్రం , కవిత రెండూ చాలా బాగున్నయాండి వర్మ గారు. చదవగానే ఒక చక్కటి అనుభూతి కలిగింది.
ReplyDeleteజలతారువెన్నెల గారూ థాంక్సండీ మీ కవితాభిమానానికి...
Delete