లాంగ్ మార్చ్
ఇప్పుడంతా నవ్వులే
అలా నవ్వుతూ
తుళ్ళుతూ
ఒకరి భుజంపై బరువు
ఒకరు మార్చుకుంటూ
చెట్టపట్టాలేసుకొని
ఒకరి వెనుక ఒకరు
ఒకరితో ఒకరు
చిన్నగా మాటాడుకుంటూ
ముసి ముసిగా నవ్వుతు
చీకట్లో వెన్నెల పూత పూస్తూ
రాదారులే లేని నేలపై
చీమల బారులా
అలా సాయుధంగా
సాహసంతో
సావాసంగా
ఉల్లాసంగా
ఉత్సాహంగా
ఉత్సవంలా
ముందుకు
మునుముందుకు...
కొండలు శిఖరాలు
నదీ నదాలు
వాగులు వంకలు
సెలయేళ్ళు జలపాతాలు
రాళ్ళూ రప్పలు
ముళ్ళూ తుప్పలు
ఏవీ అడ్డంకావు
ఆశయ సాధనకై
కదలబారడమే...
నేలరాలుతున్న
మోదుగు పూలను
ఏరుకుంటూ
జ్ఞాపకాలన్నీ
వలబోసుకుంటూ
తీర్చాల్సిన బాకీలు
తీర్చుకుంటూ
గమ్యంవైపు
వెన్ను చూపక
సాగుతున్న
లాంగ్ మార్చ్..
Its an inspiring one.
ReplyDeleteThank you Padmarpita garu..
Deleteగమ్యంవైపు
ReplyDeleteవెన్ను చూపక
సాగుతున్న
లాంగ్ మార్చ్....
కవిత అంతా చక్కగా వ్రాసారండి.
Thank you anrd garu..
Deleteచలి,ఎండా,వాన,రాళ్ళు,రప్పలు వేటిని లెక్క చెయ్యకుండా కంటికి రెప్పలా కాపుకాసే సైనికులకి మీ కవిత ద్వారా మంచి స్పూర్తి నిచ్చారు.
ReplyDeleteధన్యవాదాలు oddula ravisekhar gaaru..
ReplyDelete