ఇన్నాళ్ళు ఏమై పోయావురా
కంటికి కనబడకపోయినా
మనసుకు వినిపిస్తున్నావు...
ఓ నిశ్శబ్ధ సంగీతాన్ని వింటున్నా
నీ మునివేళ్ళ చివరనుండి...
రహస్తంత్రుల గుండా పాకుతున్న
రసధ్వనిని
ఆలకిస్తూ ఓ యుగళగీతాన్నాలపిస్తు...
నీ చెంపల నునుపుదనపు అద్దంపై
ప్రతిఫలిస్తున్న నా ముఖచిత్రాన్ని
ఆత్మీయంగా చూస్తూ
వీడికింత అదృష్టమా అని
నాపై నాకే అసూయ కలిగేలా....
గిలిగింతల వేళ
నీ వేలి చివురుల సన్నాయి రాగానికి
నే తాళమౌతూ పల్లవిస్తున్నా...
గిరిగీతల బరిబాతల సరిహద్దులను
చెరిపేస్తూ చెరిసగమైన మనం
ఒకటయిన వేళ
నింగే హద్దుగా
చీకట్లను చీలుస్తూ తలపుల
మెరుపుల జడి వాన....
దేహాత్మల కలయిక వేళ
గుండెల్లో అనంత సాగర ఘోషను
నీ చిట్లిన పెదవి చివర చూస్తూ
నా కన్నులలో తమకపు ఎరుపుదనం
నీ కళ్ళలో ప్రతిఫలిస్తూ అల్లుకున్న
నీ చేతుల బిగి సంకెళ్ళతో
కలకాలం ఇలా కరిగిపోవాలని...
"నిశ్శబ్ద సంగీతం", "దేహాత్మల కలయిక" ఇ కవితకి ప్రాణం పోసాయి వర్మాజీ.
ReplyDeletemee abhinandanalu pranam posayi Vasudevgaaru..
Deleteఅద్భుత భావాక్షర నాట్యం మీ యీ యీ పద చిత్రం వర్మాజీ . Nutakki Raghavendra Rao.
ReplyDeletemee aatmeeya spandanaku dhanyavaadaalu guruji..
Deleteఏమైపోయావురా అని అమాయకంగా అడుతూ...
ReplyDeleteకరిపోవాలని అంటూనే మీ ప్రేమసంకెళ్ళలో తనని బంధించారుగా:-)
రసరమ్యమైన భావడోలిక...
mee rasaaswaadanaapurvaka spanadanato spurthinichchinanduku dhanyavadaalu Padmarpitagaaru..
Deleteబాగుందండీ!..@శ్రీ
ReplyDeleteధన్యవాదాలు శ్రీ గారూ..
Delete