Tuesday, May 12, 2009

ఏవి తల్లీ.....

ఏవి తల్లీ మూనిరుడు మొరిగిన
మూర తుపాకులు?

రాని వసంత కాలానికి ముందే
చర్చల కూత కూసిన
తెల్ల కోయిలల రాగాలకు
వంత పాడిన వాళ్ల గొంతులు
శాశ్వతంగా మూగబోయినాయి

ఎందరో నూనుగు మీసగాళ్ళు
ధారపోసిన వృధా క్రొన్నెత్తురుతో
రాజేసిన రావణ కాష్టంలో నేడు
పేలాలు ఏరుకొని నీటుగా చలువ
గదులలో సేద తీరుతున్న వృద్ధ
జ౦బూకాల నామాలను
బయటపెట్టే వాడెవ్వడు?

రాజమార్తా౦డుల వారి ముడుచక్రాల
బండికి ముందు సైకిలు చిని
తిరుగాడుతున్నవాడి పల్లూడగొట్టే వాడెవ్వడు?

మొండి చెయ్యి తోలుబొమ్మలాటకు
నీడలా వెన్నంటి దీపపు సమ్మె అయి
వెలుగుతున్న వాడిని కాలరుపట్టి
తెరముందుకు లాగేవాదేవ్వాడు?

భ్రమల శ్లేష్మంలో చిక్కుకుని
రెక్కలాడక ఉపిరాడక
అమరుడైన వాడి స్తుపానికి
ఇటుక మోసేవాదేవ్వాడు ?

ఆకాసంలో కన్పించని అరునతారలై
మెరుస్తున్న వారి రక్తచారికలను
పులుముకుని కునిరాగాలాపనతో
కాలక్షేపం చేస్తున్న వాడి
చర్మాన్ని వలిచేవాదేవ్వాడు?

నెరిసిపోయిన వెంట్రుకలకు
గోద్రెజ్ వాడి రంగు పులుముకుని
లేని యావ్వనాన్ని చూపెడుతూ
తకధిమితోం ఆడుతున్న వాడి
అసలురంగు బయట పెట్టేవాదేవ్వాడు ?

గూగుల్ దూరని గూడెం లేకపోయే...
సెల్ మొగని సందు లేకపోయే...
సాయంకాలపు చీకు ముక్కలకు
చీప్ లిక్కరుకు వాడి ముడ్డి చుట్టూ
తిరగని వాడు కరువయినారు !

కోవర్ట్ ఎవడో నీ హార్టు ఎవరో
కనిపెట్టలేని చత్వారంతో
ఆంధ్రాలో నీ జాడే లేకుండా
చేసిన యీ ముసుగు దొంగల
బాగోతం బయట పెట్టె వాడెవ్వడు తల్లీ..
(కొంతమంది విప్లవం ముసుగులో పనిచేస్తున్న నాయకుల కార్యాచరణకు స్పందనగా)

1 comment:

  1. బాగుంది పేరడీ.
    మీ బ్లాగుమూస ఇంకా బాగుంది, కంటికింపుగా.
    మీ పేరడీలోని ఆవేదనతో ఏకీభవిస్తూనే ఒక ప్రశ్న ..
    పల్లె గూడేల్లో, గూగులు, సెల్లు ప్రవేశించడం అభివృద్ధి నిరోధకం అంటారా? ఏమోమరి, అలా ధ్వనించింది మీ మాట.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...