కొన్ని సాయంత్రాలు ధూళి మేఘం ఆవరింపబడి
గరకుగా మారిన కనుగడ్డు పగులుతూ
చెదరిన గూడు చేరక పక్షి కూనలు
బిక్కు బిక్కుమంటూ
కరకు గాలి కోతకు చిగుళ్లు తెగిన
చెట్ల విలాపం
విసురుగా కొట్టిన వాన పాయతో
గజగజలాడుతున్న పిల్లలు
భయావరణంలో ఆత్మలింకిన
ఒంటరి దేహాలు
అవును
కోల్పోతున్న ఒక్కొక్క పరిచయ స్పర్శ
నిన్నొక ఒంటరి ప్రమిదలో దీపం చేసిపోతుంది..
అధ్భుతంగా వ్రాశారు
ReplyDeleteధన్యవాదాలు రాగిణి గారు..
Deleteచిక్కని భావం చాలా బాగారాశారు
ReplyDeleteధన్యవాదాలు తీపి గుర్తులు గారు..
Deleteఅధ్భుతమండి. ఈ మధ్య అరుదుగా వ్రాస్తున్నారు
ReplyDeleteThank you Sir..
DeleteThank you Sir..
Deleteమీ భావాలు ఎప్పుడూ మర్మగర్భంగా ఉంటాయి.
ReplyDeleteగ్రేట్ లైన్స్ వర్మగారు
ReplyDeleteచాలాబాగుంది మీ కవిత్వం
ReplyDelete