Sunday, August 2, 2015

అభ్యర్థన..

కొద్దిగా ఒత్తిగిలి
ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
కాసింత విశ్రమించనివ్వండి

ఈ నేలను ఇంకిన ఈ చినుకు విత్తును
కాసింత మొలకెత్తనివ్వండి

ఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
కాసింత పూరించనివ్వండి

ఈ మెలకువకు సుషుప్తకు మధ్య
కాసింత విరామమివ్వండి

ఈ స్వప్నాన్ని ఆ వేకువ కొక్కేనికి
కాసింత వేలాడనీయండి!!

2 comments:

  1. కొద్దిగా ఒత్తిగిలి
    ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
    కాసింత విశ్రమించనివ్వండి...ఇంత జాలిగా అభ్యర్ధిస్తే కాదంటుందా :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...