Sunday, November 22, 2009

కంచె వెనకాల


నా ఇంటి నుండి, వీధి నుండి,

చివరకు నా ఊరి నుండి వెళ్ళగొట్టి,

అయినవాళ్ళ ఉసురు తీసి,

నా గొడ్డు గోదా లాక్కుని,

నన్ను లూటీ చేసి


నేను అల్లుకున్న నా కలల పొదరిల్లును కూల్చి


స్వదేశంలోనే కాందిశీకుడ్ని చేసి,


నా మెడపై నా జీవితాన్నే కాడిగా మార్చి


నీవు నీ ముళ్ళ చేతులతో పావురాలను
ఎగరేసే ద్రోహాన్ని

బద్దలుకొట్టే
క్షణం కోసం ఈ కంచెవెనకాల నేను...


(నిర్బంధ సైనిక శిబిరాల వెనక బంధింపబడ్డ శ్రీలంక తమిళులు, దండకారణ్య ఆదివాసీలకు సంఘీభావంగా)

10 comments:

  1. మనసొక్కసారి చివుక్కుమంది. నిజమే కదా జీవనమెంత భారం... తన జీవితమే తన మెడ పై కాడైనప్పుడు ... చక్కటి వ్యక్తీకరణ.. బాగుంది..

    ReplyDelete
  2. భావనగారు ధన్యవాదాలు...

    ReplyDelete
  3. బి.వి.వర్మ గారూ థాంక్యూ. నాబ్లాగు సందర్శించినందుకు.

    ReplyDelete
  4. డా.రవీందర్ సారూ నా కవిత నచ్చి సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. పవన్ గారు Thank you so much.

    మాధవ్ @ క్రియేటివె కుఱాడూ ధన్యవాదాలు.

    ReplyDelete
  6. "స్వదేశంలోనే కాందిశీకుడ్ని చేసి" ఈ ఒక్క పాదం చాలు. అమృత సినిమాలోని ఒక సన్నివేశం గుర్తుకు వచ్చింది. ఈ బాణి మీకు కొట్టిన పిండి.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...