Monday, December 9, 2013

ఇడియట్ పోస్ట్

 
ఎవరూ రారిప్పుడు
ఓ ఇడియట్ ని చూడ్డానికి

తెలీనితనమో
తెలివిలేనితనమో

పసిమనసో
మసి మనసో

తెలియక చేసిన
తెలిసి చేసినా

ఒఠ్ఠి మూర్ఖత్వమో
ఒంటరితనమో

వదిలెల్తావా
వదిలేస్తావా

ఎంగిలి పంచుకున్న
ఐస్ క్రీమ్ కరగకముందే

రావి ఆకు పై రాసుకున్న
బాసలన్నీ చెరిపేస్తావా

గడ్డకట్టిన ఎదపై
కాసింత నిదురరాని 
మెలకువ కాలేవా??

(పోరా ఇడియట్ అన్న నేస్తానికి)

4 comments:

  1. "గడ్డకట్టిన ఎదపై
    కాసింత నిదురరాని
    మెలకువ కాలేవా??"
    కొత్తదనపు పదప్రయోగ పరిమళం బాగుందండి

    ReplyDelete
  2. అంతటి ధైర్యం ఎవరికండి కుమారవర్మగారు.

    ReplyDelete
  3. ఒఠ్ఠి మూర్ఖత్వమో
    ఒంటరితనమో

    వదిలెల్తావా
    వదిలేస్తావా
    ఇలా అడగ గలిగేది స్నేహం లోనేగా....
    నిజమైన స్నేహితులెప్పుడూ ఏ సమయంలోనూ స్నేహాన్ని దూరం చేసుకోరు.....వేచి చూడండి

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...