Friday, December 27, 2013

కాగుతున్న ఋతువు..

చేతులతో కాసిన్ని ఎండుపుల్లలు పోగేస్తూ నువ్వలా నిప్పు రాజేస్తూ వుంటే కనులలో పడ్డ ఆ కాంతి ఎఱగా మెరుస్తూ చుట్టూ వెచ్చగా పరుచుకుంటూ

అరచేతులను కాపుకుంటూ బుగ్గలపై వేస్తూ లోలోపలికి వెచ్చదనాన్ని పోగేసుకుంటూ మంటను ఎగదోస్తూ వీస్తున్న చల్లగాలిని కాసింత వేడిగా మార్చుకుంటూ

ఈ చెట్ల మద్య రాలిన ఆకులను యిలా కాగబెడుతూ కరుగుతున్న మంచు బిందువులను వేలితో తాకుతూ చెంపలపై రాస్తూంటే ఝుమ్మన్న నాదం గొంతులో ఒలికిపోతూ

ద్వైతం అద్వైతంగా మారుతున్న క్షణాల మద్య రాకాసి బొగ్గులా మండుతున్న ఒంటరితనమేదో మెదడు గోళంలో పగులుతూ ఉసుళ్ళమంటను చీలుస్తూ

రెండు దేహాత్మల మద్య కాగుతున్న నిశ్శబ్దాన్ని బద్ధలుకొట్టే సమయం దూరమవుతూ కాలం చీకటి పొరల మద్య ఒదిగిపోతూ

10 comments:

  1. ఋతువు ఏదైనా దానికి అనుగుణంగా సాగిపోవడమే...తప్పదు

    ReplyDelete
    Replies
    1. మీరన్నది రైట్ పద్మార్పిత గారు..

      Delete
  2. నిశ్శబ్దాన్ని బద్ధలుకొట్టే సమయం దూరమవుతూ కాలం చీకటి పొరల మద్య ఒదిగిపోతూ
    తప్పదా....

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు మార్కండేయ గారు.._/\_

      Delete
  4. ద్వైతం అద్వైతంగా మారుతున్న క్షణాల మద్య రాకాసి బొగ్గులా మండుతున్న ఒంటరితనమేదో మెదడు గోళంలో పగులుతూ ఉసుళ్ళమంటను చీలుస్తూ.....చాలా చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకు ప్రేరణ గారు.. ధన్యవాదాలు..

      Delete
  5. కవితని పేరాగ్రాఫ్ ల కూడా రాయొచ్చని నాకు తెలీదు. కవిత నచ్చింది

    ReplyDelete
  6. yelaa raasina kavitala nachinanduku thanksandi aakaanksha garu

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...