(అసంపూర్ణం)
ఏదో ఒకటి చెప్పాలని
చూడకు
ఏదో ఒకటి రాయాలనీ
చూడకు
గాయాన్ని కాస్తా సున్నితంగా
తాకరాదూ
వద్దులే
చీలికల మద్య
పేడులా అతుకు నిలవదు
మనసు
విప్పడానికి
ఉల్లి పొరలులా
చినిగిపోతూ వీడదు కదా!
దేనికదే
ఒక్కోటీ
తన తన
అభావాన్ని
కప్పుకుంటూ
పేలిపోనీ
దాయలేనితనమెప్పుడూ
పత్తి పువ్వులా
విచ్చుకుంటూనే
వుండాలి కదా!
అతకనితనమే
నిన్నూ
నన్నూ
నిలువరిస్తూ
నిప్పులా
రాజేస్తుంది......
బహుశా ఆ అతకనితనమే మీకు బహుప్రీతి కాబోసు :-)..... ఏమైనా కవితాభావం సంపూర్ణమై బాగుందండి.
ReplyDeleteమీరు సంపూర్ణమంటే పరిపూర్ణమయినట్టే.. ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Deleteదాయలేనితనమెప్పుడూ
ReplyDeleteపత్తి పువ్వులా
విచ్చుకుంటూనే
వుండాలి కదా! కవిత బాగుందండి
ధన్యవాదాలు రూప గారు. వెల్కం టు మై బ్లాగ్..
Deleteమనసు విప్పగలిగినప్పుడు ....
ReplyDelete.అతకనితనం నిలువరిస్తూన్నా ...
.దాచలేముగా బంధాన్ని.....
చదివిన ప్రతీసారీ ఎన్ని అర్దాలనీ మీ కవితలో...."కవి వర్మ" గారూ....
మీరిలా అర్థాలన్నీ వెతికి చెప్తే బాగుంటుంది అనూ గారు.. థాంక్యూ..
Deleteబాగుందండి మీ కవిత
ReplyDeleteధన్యవాదాలు సృజన గారు..
Deleteవర్మగారు మళ్ళీ ఫ్లోలో రాసేస్తున్నారు. ఆపకండి
ReplyDeleteఆపొద్దన్నారు కదా.. అలాగే థాంక్యూ అనికేత్..
Deleteచాలా బాగుందండి
ReplyDeleteThank you Viswanji..
Deleteబాగుందండి మీకవిత
ReplyDeleteThank you Yohanth gaaru..
Delete