అతడెప్పుడూ గాయాల్ని మోసుకు తిరుగుతాడు
దేహమంతా ఓ మూలిక చిగురిస్తున్నట్టు
కళ్ళలో వెలుతురుతో
అతడెప్పుడూ గాయాల్ని గానం చేస్తూ తిరుగుతాడు
అంతరంగంలోని ఆగ్రహాన్ని నినాదంలా మార్చి
అందరి గొంతులో
అతడెప్పుడూ గాయాల్ని తూటాలా మార్చి తిరుగుతాడు
నెత్తుటి బాకీని తుపాకీ మొనకు బాయ్ నెట్ గా గుచ్చి
అందరి భుజాలపై
అతడెప్పుడూ గాయాల్ని ఝెండాలా ఎగరేస్తూ తిరుగుతాడు
మట్టిలోని జ్నాపకాల్ని తవ్వి పోస్తూ
అందరి చేతులలో
అతడెప్పుడూ గాయాల్ని పూలగుత్తులుగా మార్చి తిరుగుతాడు
ఓటమిలోంచి గెలుపు బాటను వేస్తూ
అందరి చిరునవ్వులలో
దేహమంతా ఓ మూలిక చిగురిస్తున్నట్టు
కళ్ళలో వెలుతురుతో
అతడెప్పుడూ గాయాల్ని గానం చేస్తూ తిరుగుతాడు
అంతరంగంలోని ఆగ్రహాన్ని నినాదంలా మార్చి
అందరి గొంతులో
అతడెప్పుడూ గాయాల్ని తూటాలా మార్చి తిరుగుతాడు
నెత్తుటి బాకీని తుపాకీ మొనకు బాయ్ నెట్ గా గుచ్చి
అందరి భుజాలపై
అతడెప్పుడూ గాయాల్ని ఝెండాలా ఎగరేస్తూ తిరుగుతాడు
మట్టిలోని జ్నాపకాల్ని తవ్వి పోస్తూ
అందరి చేతులలో
అతడెప్పుడూ గాయాల్ని పూలగుత్తులుగా మార్చి తిరుగుతాడు
ఓటమిలోంచి గెలుపు బాటను వేస్తూ
అందరి చిరునవ్వులలో
అతడెప్పుడూ పదాలతో...చురుక్కుమనిపిస్తూ... మనుష్యులకు మెలకువ తెప్పిస్తూ ఈ ప్రపంచంలోకి...స్వేచ్చా ప్రపంచంలోకి నడిపిస్తూంటాడు....
ReplyDeleteఅద్భుతంగా రాసారు "కవి వర్మ" గారూ....మీ "అతడు" ...మమ్మల్ని ఉత్తేజపరుస్తూ.
Thanksandi..
DeleteGood one Varmagaru
ReplyDeleteThank you Padmarpita garu..
Deleteచాలా బాగుందండి
ReplyDeleteధన్యవాదాలు మాయావిశ్వం గారు..
Deleteఅతడో దీరుడు అందుకే ఎప్పుడూ పోరు సలుపుతూనే ఉంటాడు,
ReplyDeleteచక్కని శైలి వర్మాజి.
మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ.
Deleteఅతడెప్పుడూ గాయాల్ని ఝెండాలా ఎగరేస్తూ తిరుగుతాడు
ReplyDeleteమట్టిలోని జ్నాపకాల్ని తవ్వి పోస్తూ
అందరి చేతులలో....:-)
మీ చిర్నవ్వు స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారు..:-)
Deleteఅద్భుతంగా వ్రాసారు
ReplyDelete