అప్పుడప్పుడూ కాలం కొన్ని నవ్వులను మాయం చేస్తుంది
శీతల గాలులు వీస్తూ మంచు పట్టిన పువ్వులను దాచినట్టు
లోలోపల సుళ్ళు తిరిగే రాగాన్ని వేణువు తన ఊపిరి స్వరంలో దాపెట్టినట్టు
అమ్మ తన కొంగులో రూపాయి బిళ్ళను నాకోసం ముడివేసినట్టు
కానీ
మాయమయిన నవ్వులు మరల కానరాక
ఈ వంతెన చివర దోసిలిలో ఇన్ని పూరెమ్మలతో వేచి వున్నా
వస్తావా నేస్తం
మరలా కాసిన్ని నవ్వుల వెలుగు రేకలను పూయిస్తావా?

మబ్బు తెరలూ విడిపోతాయీ...మంచుతెరలూ విడిపోతాయీ ...మాయమైన చిరునవ్వులు విరబూస్తాయి.....వర్మగారు మీ నిరీక్షణ బాగుంది .
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గాజుల గారు..
Deleteమీ నిరీక్షణ ఫలించాలని కోరుకుంటున్నాం
ReplyDeleteమీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు ప్రేరణ గారు..
Deleteమిమ్మల్ని నిరీక్షింపజేసి మీ కలలయామిని తట్టుకోలేదేమో కదండీ :-)
ReplyDeleteఅంతేనంటారా..:-)
Deleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
ఆశావాద నిరీక్షణ ఫలిస్తుందిలెండి :-)
ReplyDeleteథాంక్సండీ తెలుగమ్మాయి గారు..ః-)
Deleteనవ్వుల వెలుగు రేఖల్ని పుయించడం కోసం -
ReplyDeleteఓ నేస్తాన్ని పిలిచిన తీరు చాలా బావుంది వర్మ గారూ
ధన్యవాదాలు శ్రీపాద సార్.. _/\_
Delete