Thursday, January 9, 2014

రాయబడని లేఖ...


ఇప్పుడో ప్రేమ లేఖ రాయగలనా!
 
ఆవరణమంతా రాలిన ఆకులు పూరేకులు ఎండుపుల్లలతో
నిండి గోడలన్నీ నాచు పట్టి పచ్చగా ఎండిన చోట
ఒక్కొక్కరి పేరు గోళ్ళతో చెక్కుతూ
దూరమైన గీతల మద్య ఖాళీలను
మరల పూరించలేక నలుపుదనమేదో
అతుక్కుపోయి చెమ్మ లేని పొర రాలిపోతూ

నువ్వక్కడే విసిరేసిన కాగితపు వుండ
వెలసిపోయి మూలగా ఒదిగి
అలుక్కుపోయిన అక్షరాలు
మెరుస్తున్నాయని నువ్వబద్దమాడితే

మరో మారు గుండె విరిగిన చప్పుడయి
మళ్ళీ రాయగలనా ప్రేమ లేఖ!!

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మనసు పెట్టి రాస్తే పుంఖాను ఫుంఖలు రాయగలరు వర్మగారు ప్రేమలేఖలు. లిఖించండి :-)

    ReplyDelete
  3. మీవంటి వారు రాసిన ప్రేమలేఖ విసిరేయడమే !
    అపురూపంగా దాచుకోక.రాయకపోతే ఎలా రాయక తప్పని పరిస్థితి వస్తే.కదూ

    ReplyDelete
  4. మీవంటి వారు రాసిన ప్రేమలేఖ విసిరేయడమే !
    అపురూపంగా దాచుకోక.రాయకపోతే ఎలా రాయక తప్పని పరిస్థితి వస్తే.కదూ

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...