Tuesday, January 14, 2014

నిర్వికల్పం..

నీ చుట్టూ పరచుకుంటున్న నిశ్శబ్దాన్ని
గ్రహించలేనితనం

ఒకటే ఒడిదుడుకుగా అడుగులు వేస్తూ
పరుగు

అయినా ఒక్కడుగు ముందుకు
జరగనితనం

ఇన్నిన్ని మాటలు నీ ముందు
కుప్పబోసి

ఒక్కటీ ఇంకనితనంతో
ఆవిరవుతూ

రెప్ప మూతల మద్య పొర ఏదో
తడిగా ఇగురుతూ

జ్వరపు చేయి వెచ్చగా
నుదుటిపై తాకుతూ

నువ్వలా రక్తమింకిన పెదాలతో
తెల్లగా నవ్వుతూ

సమాధానంగా ఒట్టి చేతులతో
మోకరిల్లుతూ నేను!

(తే 13-01-2014 దీ రాత్రి 11.18)

6 comments:

  1. మీ కవితకన్నా టైటిల్ చాలా నచ్చిందండి

    ReplyDelete
    Replies
    1. అందులోనే నా భావం దాగుంది కదా పద్మార్పిత గారూ. థాంక్యూ..

      Delete
  2. రెప్ప మూతల మద్య పొర ఏదో
    తడిగా ఇగురుతూ....కొత్త పదబంధం బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రేరణ గారు..

      Delete
  3. ఇంకా ఇంకా ఏదో అర్థం అవుతున్నట్టుగా,
    మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉందండి

    ReplyDelete
  4. నువ్వలా రక్తమింకిన పెదాలతో
    తెల్లగా నవ్వుతూ

    సమాధానంగా ఒట్టి చేతులతో
    మోకరిల్లుతూ నేను!....ఎంతటి నిస్సహాయస్థితో

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...