ఖాళీలను పూరింపుము
.............................
..........................
అవును
అతనింకా నా చేయి పట్టుకు నడిపిస్తున్నట్టే వుంది
నువ్వంటావు
యింకానా
నీ కన్రెప్పలు ముడుతలు పడుతున్నప్పుడూనా
అని
...........................
......................
అవును
అతనింకా తన మొదటి ముద్దను ఆప్యాయంగా
నోటి కందించి పొలమారితే తలపై
ఆత్మీయంగా తడుతున్నట్టు
నువ్వంటావు
యింకానా నెత్తిమీద రంగు మారుతున్నానా
అని
...........................
......................
అవును
ఆయాసంగా రొప్పుతూ గుమ్మం లోపలికి అడుగువేసిన వేళ
రారా యిలా వచ్చి కూచోమని
అనురాగాన్నంతా నుదుటిపై ముద్దుగా మార్చినట్టు
నువ్వంటావు
సగం ఆయుష్షు మింగేసిన వేళ కూడానా
అని
........................
......................
అవును
యిప్పుడీ
ఖాళీని
పూ
రిం
పు
ము
......................
....................
..........................
అవును
అతనింకా నా చేయి పట్టుకు నడిపిస్తున్నట్టే వుంది
నువ్వంటావు
యింకానా
నీ కన్రెప్పలు ముడుతలు పడుతున్నప్పుడూనా
అని
...........................
......................
అవును
అతనింకా తన మొదటి ముద్దను ఆప్యాయంగా
నోటి కందించి పొలమారితే తలపై
ఆత్మీయంగా తడుతున్నట్టు
నువ్వంటావు
యింకానా నెత్తిమీద రంగు మారుతున్నానా
అని
...........................
......................
అవును
ఆయాసంగా రొప్పుతూ గుమ్మం లోపలికి అడుగువేసిన వేళ
రారా యిలా వచ్చి కూచోమని
అనురాగాన్నంతా నుదుటిపై ముద్దుగా మార్చినట్టు
నువ్వంటావు
సగం ఆయుష్షు మింగేసిన వేళ కూడానా
అని
........................
......................
అవును
యిప్పుడీ
ఖాళీని
పూ
రిం
పు
ము
......................
....................
తొలకరి జల్లుకు తడిసిన మట్టి పరిమళంలాంటి మీ జ్ఞాపకాలు మనసుని చుట్టుముట్టాయి.
ReplyDeleteఆ అపురూపమైన బంధాలను అనుభవించలేకపోయిన నాకు మీ ఈ జ్ఞాపకాల ద్వారా మనసులోని ఖాళీలను పూరించారు 'కవి వర్మ' గారూ, ఆ ఆప్యాయతానురాగాలు మనసుని తాకాయి.
ఈ ఖాళీలను ఎవరు మాత్రం పూరించగలరు చెప్పండి
ReplyDeleteఅవును ఆ ఖాళీలు అలాగే ఉండాలి అవి పూరించేందుకైనా ఈ కవి కలకాలం ఉంటాడు.
ReplyDelete