Monday, January 6, 2014

ఉదయ్ కిరణ్ స్మృతిలో


ఇప్పుడు సమయాలన్నీ సందర్భం
అవుతున్న వేళ

ఒక్కొక్కరూ అలా వెళ్ళి పోతూ
కొన్ని జ్నాపకాలుగా ఫ్రేంలో ఒదిగిపోతున్న వేళ

మరుసటి రోజు ఓ గులాబీ
తరువాత వాడిపోయిన రేకులుగా

ప్రమిద చుట్టూ ఒలికిన నూనె
జిడ్డుగా నల్లగా

కాస్తంత ఎత్తిపట్టు ఒత్తిని
కాంతిలో వెతుకుతు
ఇన్ని కన్నీటి
చుక్కలను
తుడుచుకోని

రాత్రి కురిసిన
మంచు
పాదం
అంచులో
కరిగిపోతూ

పోకడ తెలీని
వార్తగా
మారి
కాసేపు
మాటల మద్యలో
మిగిలి
పొగ వలయంలా
ఎగబాకుతూ

నీ కళ్ళు
నవ్వుతూనే
మట్టిలో
కలిసిపోయే
వేళ మేమంతా
వెండితెర ఇవతల
పాన్ నములుతూ
గోడలన్నీ ఉమ్ముతూ

చిత్రం పూర్తికాకుండానే
తానే బ్లాక్ అండ్ వైట్
ఫోటోగా గోడకు
వేలాడుతున్నాడు

టాటా చెప్పని
చేయేదో
గాల్లో ఊపుతూ
సెలవింక...

(సినీ పరిశ్రమచే నిరాదరణ హత్యకు గురైన ఉదయ్ కిరణ్ స్మృతిలో)

4 comments:

 1. కంట తడి పెట్టించారు . నిజం . మీ ప్రతి మాటా ఓ గొప్ప నివాళి అవుతుంది. మీ సహృదయ స్పందనకు నా జోహార్లు

  ReplyDelete
 2. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళి

  ReplyDelete
 3. రాత్రి కురిసిన
  మంచు
  పాదం
  అంచులో
  కరిగిపోతూ
  హృదయం ధ్రవించింది

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...