Sunday, October 13, 2013

వస్తున్నా.......


ఒకరికొకరం ఎదురుపడనంత కాలం
ఇద్దరమూ నిజాయితీపరులమే

మామూలుగా మాటలల్లికల్లేని
పదాలతో మాటాడుకున్నామా?

ప్రశ్నగా కొడవలి ముందు
తలవంచాలా మనం

నువ్వూ నేనూ కవలలమా కాదే!
నీవో వైపూ నేనో వైపూ నిలబడ్డామే

బరిగీతల వెనకాల ఒక అడుగు
వెనక్కే నీ నా పాదాలు

మరి ఈ పెదాలకంటిన ప్లాస్టర్ని
ఊడబెరికే వేరే చేయికోసం ఎదురు చూస్తావెందుకు?

నీకు చేతి దూరంలోనే పేర్చిన
ముళ్ళ కంచెను దాటి రాలేవా?

పాదాల కింద అదనపు చర్మపు
పొర తగిలించుకున్న స్పృహ లేదా?

గాజు పాత్రనిలా భళ్ళున పగిలిన
శబ్ధం నీ చెవిటి చెవికి చేరి వుండదులే!

అందుకున్న మధుపాత్రను నీ
పెదవి చివర ఎంగిలి కానీయక అందించగలవా?

రాలేనన్న తుఫానును ఆహ్వానిస్తూ
ఒడ్డున కూచున్న నీ జపం దేనికోసం?

దేహమంతా పాకిన రాచకురుపు బాధ
ఇంకా నీ కన్నులకి పాకలేదనా?

ఎవరొస్తారులే అడగడానికి అన్న నీ
ధీమా నీ పెదవి చివరి నవ్వు వెక్కిరిస్తోంది

నాలోంచి నిన్ను పెకళించి
ఓ అక్షరం చేయగల శక్తి ఇంఅా నిద్రపోలేదులే

ఈ బరిగీత దాటి కత్తి దూసి కూత మరవని
పట్టు ఇంకా గొంతు పెగలి వస్తోంది

ఏ చిహ్నమూ లేని నదీ పరిష్వంగంలో
కాసింత వెన్నెలనిలా దోసిలిలో పట్టి

వస్తున్నా.....

8 comments:

  1. నాలోంచి నిన్ను పెకళించి
    ఓ అక్షరం చేయగల శక్తి ఇంకా నిద్రపోలేదులే.....

    ఏ శక్తీ మిమ్మల్ని ఎన్నటికీ ఆపలేదు.మీకే ప్రత్యేకమైన మీదైన శైలిలో నిరంతరం ఆలోచింపజేసే,ఆవేశపరిచే మీ పదాల వెల్లువ మరిన్ని ఆశయాలతో మాకై ఇలా నిరంతరమూ ప్రవహిస్తూనే ఉండాలని కోరుకుంటూ

    ReplyDelete
  2. మీరు రాసేవి నా మట్టిబుర్రకి కాస్త ఆలస్యంగాను, అర్థమై కానట్లుగానే ఉంటాయి ఎందుకో!

    ReplyDelete
    Replies
    1. మీరే అలా అనేస్తే ఎలా చెప్పండీ...
      థాంక్యూ అనికేత్...

      Delete
  3. ఈ కవితకి కమెంట్ పెట్టడం కష్టమే....అందుకే మౌనంగా ఆస్వాధిస్తున్నా_________________________ఖాళీని పూరించండి :-)

    ReplyDelete
    Replies
    1. ఆస్వాదిస్తున్నా అన్నారు అదే పది వేలు. ఖాళీలు వాటికవే పూరింపబడును..:-)
      థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  4. మీదైన ప్రత్యేక శైలిలో బాగుందండి.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...