Monday, October 21, 2013

పూల రెక్కల పాట..


నువ్ పాడిన తత్వమేదో
ఈ గాలి వీస్తూ
వెలుగు దారుల గుండా
అడుగు జాడలౌతూ...

జీవన తాత్వికత యేదో
మార్మికమౌతూ
పరిమళాన్నద్దిన 

పూల రెక్కల పాట వాకిలి ముందు...

కనుమరుగవుతున్న
కాల్పనికత ఒక్కోటీ
కనులముందు
ఆవిష్కారమవుతూ...

4 comments:

  1. జీవిత తాత్వికతను అర్థం చేసుకోవడం మా వంటి సామాన్యుల వల్ల కాదు....
    అలాగే మీ ఈ కవితను కూడా....
    మీరు ఆ స్థితిని చేరిన ధన్యులు....మీకు నా వందనం.

    ReplyDelete
  2. వర్మగారు....ఇలా తత్వభోధనలో పడి వెన్నెలేంటి వేడేంటని దారి మళ్ళి గాయబ్ కాకండి :-)

    ReplyDelete
  3. బాగుందండి మీరు చెప్పిన తత్వం.

    ReplyDelete
  4. సార్ ఇలా తత్వం బోధిస్తూ జలక్ ఇస్తే ఎలాగండి :)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...