Tuesday, October 1, 2013

ఖాళీగా........

 
...........
ఖాళీగా
మరింత
ఖాళీగా
..........

కరచాలనమూ
కరవై
...........

పెళుసుగా
మారుతూ
..........

చెరోవైపు
చీలిక
మద్య
పేడులా
..........

ఖాళీగా
అవరోహణా
క్రమంలో
........

మొలక 
రాని
విత్తులా
.........

గాలి 
చొరవని
గదిలా
.........

గుండెనుండి
వెలి అయి
ఖాళీగా
........

నువ్వొక
దాహపు
గొంతువలె
..........

నేనీ
గది
బయట
..........

వెదుళ్ళ
వనంలో
రొప్పుతూ
ఖాళీగా
..........

12 comments:

  1. ఖాళీగా ఖాళీగా అంటూ మా మనసుని మీ చిన్ని పదాల భావంతో నింపేసారుగా "కవి వర్మ" గారూ

    ReplyDelete
  2. depth feel in small words sir.

    ReplyDelete
  3. బహుశా మీకు ఖాళీతనం పై ఉన్న అభిమానం, ఒంటరితనం పై ఉన్న ఇష్టమే మీతో ఇలా అందమైన కవితలా పలికిస్తుందేమో. చాలా బాగారాసారు.

    ReplyDelete
    Replies
    1. ఏమో.... మనసు లోలోపలి ఖాళీలు ఇలా పలుకుతున్నాయేమో పద్మార్పిత గారు..
      థాంక్యూ చాలా రోజుల తరువాత మీ మాట..

      Delete
  4. చిన్నిపదాల ఖాళీ కవిత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు థాంక్సండీ తెలుగమ్మాయి గారు..

      Delete
  5. పదాలని కూడా ఇంత పొదుపుగా వాడాలాండి వర్మగారు :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...